మన జీవితంలో కొన్ని సంఘటనలు జీవితాంతం గుర్తుండి పోయేలా ఉంటాయి.  అది మంచి అయినా..చెడు అయినా వాటి ప్రభావం చాలా ఉంటుంది.  ఇలాంటి సంఘటన స్టార్ డైరెక్టర్ శంకర్ జీవితంలో జరిగిందట. ఆ సంఘటనతోనే దాదాపు రెండు దశాబ్దాల క్రిందట ‘భారతీయుడు’ సినిమాతో ప్రేక్షకులకు కొత్త కోణం చూపించారు డైరెక్టర్ శంకర్.   లంచం ఇవ్వడం నేరమే..తీసుకోవడం నేరమే..ఇదే కాన్సెప్ట్ తో వచ్చిన ‘భారతీయుడు’అప్పట్లో సంచలన విజయం సాధించింది.  1996లో శంకర్ దర్శకత్వంలో విశ్వ నటుడు కమలహాసన్ ద్విపాత్రాభినయంలో నటించిన సినిమా ‘భారతీయుడు’.
Image result for భారతీయుడు 2
ఈ సినిమా సీక్వెల్ ‘భారతీయుడు-2’ షూటింగ్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. నాడు బ్లాక్ బస్టర్ గా రికార్డులు నెలకొల్పిన ‘భారతీయుడు’ని తెరపైకి ఎక్కించడానిక గల కారణాన్ని దర్శకుడు శంకర్ వెల్లడించారు.  కాలేజ్ లో అడ్మిషన్ కోసం వెళితే తన కుల, ఆదాయానికి సంబంధించిన ధ్రువీకరణపత్రాలు కావాలని యాజమాన్యం తనను అడిగిందని శంకర్ చెప్పారు. ఈ ధ్రువీకరణ పత్రాల కోసం సంబంధిత అధికారుల వద్దకు తన తల్లిదండ్రులు వెళితే తమకు లంచం ఇవ్వాలని వారు డిమాండ్ చేసిన విషయాన్ని శంకర్ గుర్తుచేసుకున్నారు.
Image result for భారతీయుడు 2 పోస్టర్
ఆ ఘటననే ఈ సినిమా తెరకెక్కించడానికి కారణమైందని తెలిపారు శంకర్.  ఈ దేశంలో చాలా పనులు ముఖ్యంగా ప్రభుత్వ ఆఫీసుల్లో లంచం లేనిదే పనులు జరగవని..అందుకే లంచగొండితనపైం సినిమా తీసి ప్రజను కాస్తైనా ప్రభావితం చేయాలని కోరికతో ఆ సినిమా తీశానని అన్నారు శంకర్.  అప్పట్లో కమల్ హాసన్- శంకర్ కాంబోలో వచ్చిన ఆ సినిమా గత రికార్డులను తిరగరాసింది.  'భారతీయుడు 2' పేరుతో రాబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి (జనవరి 18) ప్రారంభం కానుంది. ఇక ‘భారతీయుడు 2’ లో ప్రస్తుతం సామాన్య మనిషి ఎదుర్కొంటున్న సమస్యలను చూపించనున్నామని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: