ఎన్టీఆర్ వర్థంతి రోజు రామ్‌గోపాల్ వర్మ మరో సంచలనం సృష్టించారు. టీడీపీ నేతలంతా ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాలు ఘనంగా చేస్తుంటే.. ఆయన తన కొత్త సినిమా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాలోని ఎన్టీఆర్ పాత్రధారి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ముందు సాయంత్రం 5 గంటలకు ఫస్ట్ లుక్ ఉంటుందని ప్రకటించి.. ఆ తర్వాత ఆ ముహూర్తాన్ని 6.57 గంటలకు మార్చారు.



ఆ తర్వాత అన్న సమయానికే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లోని ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. తన ఆర్జీవీ యూట్యూబ్ ఛానల్లో 53 సెకన్ల వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఓ వర్షం కురిసిన రాత్రి, మెరుపులు వస్తుండగా ఎన్టీఆర్ ఓ గదిలో విచారంగా కూర్చుని ఉన్నారు.


విచార వదనంతో దీర్ఘాలోచనలో కుర్చీలో వెనక్కుపడుకుని కళ్లుమూసుకుని ఉన్న ఎన్టీఆర్.. ఆ తర్వాత మెల్లిగా తలలేపి సూటిగా చూడటంతో వీడియో పూర్తవుతుంది. అయితే ఈ వీడియోలో ఉన్న నటుడెవరన్న వివరాలు మాత్రం వర్మ ట్విట్టర్లో పోస్ట్ చేయలేదు. ఎన్టీఆర్ పాత్రధారి మాత్రం ఎన్టీఆర్ లుక్‌కు బాగానే సూట్ అయ్యారు.



వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ద్వారా మళ్లీ తిరిగి జన్మించారంటూ వర్మ తన పోస్ట్ లో కామెంట్ చేశారు. ఈ వీడియో కూడా యూట్యూబ్‌లో పెట్టిన గంటసేపటికే లక్షవ్యూస్ సాధించింది. ఈ వీడియో యూ ట్యూబ్ ట్రెండింగ్‌లో ఐదో స్థానంలో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: