నిన్నరాత్రి జరిగిన ‘ఎఫ్ 2’ సక్సస్ మీట్ లో ఉద్వేగంతో మాట్లాడిన వెంకటేష్ మాటలు అందరికీ బాగా కనెక్ట్ అయ్యాయి. ఇలాంటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి తనకు మాటలు రావడం లేదనీ ఉద్వేగానికి లోనయ్యాడు వెంకటేష్. తాను సినిమాలను ధియేటర్లలోకి వెళ్లి చూడటం మానివేసి 10 సంవత్సరాలు అయిందని అంటూ ‘ఎఫ్ 2’ మూవీని తాను ధియేటర్ లో చూసినప్పుడు పగలబడి నవ్వుతున్న ప్రేక్షకులను చూసి తాను ఆనందంతో తనకంట కన్నీరు ఆపుకోలేకపోయిన సందర్భాన్ని వివరించాడు.
ప్రేక్షకులు తన నటనపట్ల చూపించిన అభిమానంతో తాను గతంలో నటించిన ‘ప్రేమించుకుందాం రా’ ‘బొబ్బిలి రాజా’ ‘చంటి’ ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాలు గుర్తుకు వచ్చాయని ఉద్వేగంతో వెంకటేష్ అలనాటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. దర్శకుడు అనిల్ రావి పూడి తనకు ఈసినిమా కధను చెప్పినప్పుడు తాను కూడ ఈసినిమాకు ఈ రేంజ్ సూపర్ హిట్ వస్తుందని ఊహించుకోలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.
ఇదే సందర్భంలో వెంకటేష్ తన ఉపన్యాసం కొనసాగిస్తూ ఒక సినిమా విజయం వెనుక కనీసం రెండువందల మంది పడిన కష్టం ఉంటుంది అంటూ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో ఈసినిమాను అందరు కష్టపడి చేయడంతో తనకు ఈ రేంజ్ హిట్ వచ్చింది అన్న అభిప్రాయం వ్యక్త పరిచాడు. ఈ సినిమాలో తన పూర్వపు కామెడీ నటన తిరిగి బయటపడటానికి గల కారణం అనీల్ రావిపూడి అంటూ మరింత రెచ్చిపోండీ అంటూ అనీల్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే తాను అంత హుషారుగా నటించగలిగాను అను అంటున్నాడు.
ఇదే సందర్భంలో వెంకటేష్ వరుణ్ తేజ్ పై కూడ ప్రశంసలు కురిపిస్తూ తాను చిరంజీవితో ఇప్పటి వరకు కలిసి నటించని లోటును వరుణ్ తేజ్ తీర్చాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. ఈ ఫంక్షన్ లో వరుణ్ తేజ్ నోటి వెంట ‘ఎఫ్ 3’ మూవీ ప్రకటన రావడంతో ఈమూవీలో కూడ వెంకటేష్ హీరోగా నటిస్తాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి..