‘వినయ విధేయ రామ’ మూవీకి ప్రచారం అయినట్లుగా నెగిటివ్ టాక్ ఈమధ్య కాలంలో ఏటాప్ హీరో సినిమాకు జరగలేదు. అయితే ఇలాంటి భయకరమైన నెగిటివ్ టాక్ ను తట్టుకుని ఈమూవీ తన మొదటివారం రన్ పూర్తి చేసుకునే సరికి 50 కోట్ల నెట్ కలక్షన్స్ వసూలు చేయడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 
తొలి రోజు షేర్ అంచనా
సాధారణంగా ఒక టాప్ హీరో సినిమా ఫెయిల్ అయితే ఆసినిమాను టార్గెట్ చేస్తూ ముఖ్యంగా ఆహీరోను టార్గెట్ చేస్తూ సెటైర్లు పడటం పరిపాటి. అయితే ‘వినయ విధేయ రామ’ విషయంలో చరణ్ పై కన్నా బోయపాటి పై ఎక్కువగా సెటైర్లు పడ్డాయి. బోయపాటి పని అయిపోయింది అంటూ అతడిని వినాయక్ శ్రీనువైట్ల పూరి జగన్నాథ్ లాంటి ఫెయిల్యూర్స్ డైరెక్టర్ల లిస్టులో చేర్చి బోయపాటి ఇమేజ్ కి ఎంతవరకు డామేజ్ చేయాలో అంత నెగిటివ్ ప్రచారం చేసారు. 
సంక్రాంతి సీజన్
అంతేకాదు బోయపాటి టేకింగ్ స్టైల్ కు ప్రేక్షకులు ఆసక్తి కనపరచడంలేదని భవిష్యత్ లో ఇలాంటి మాస్ సినిమాలు తీసే సాహసం ఏటాప్ డైరెక్టర్ చేయడు అంటూ ఘాటైన కామెంట్స్ కూడ చేసారు. అయితే ఈకామెంట్స్ తో బోయపాటి తన స్టైల్ ను మార్చుకోవాలా లేకుంటే ఫెయిల్యూర్ వచ్చినా 50 కోట్ల కలక్షన్స్ ను ఇచ్చిన ప్రేక్షకుల అభిప్రాయాన్ని గుర్తించి తను ఇదే తరహా సినిమాలు చేయాలా అనే విషయంలో బోయపాటిని ‘వినయ విధేయ రామ’ రిజల్ట్ కన్ఫ్యూజ్ చేస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి. 
 నాన్ బాహుబలి రికార్డ్
దీనితో బోయపాటి తాను బాలకృష్ణతో వచ్చేనెల మొదలు పెట్టవలసి ఉన్న సినిమాకు ఎటువంటి కథను ఎంచుకోవాలి అన్న విషయంలో తెగ కన్ఫ్యూజ్ అయిపోతున్నట్లు  సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ షాక్ లో ఉన్న బాలకృష్ణను ఒక సాధారణ కథ చెప్పి ఒప్పించడం కష్టం కాబట్టి ఒక మంచి సబ్జెక్ట్ కోసం అన్వేషణ చేస్తూ బోయపాటి ప్రస్తుతం తన టీమ్ తో చర్చలు జరుపుతున్నట్లు టాక్. దీనితో బోయపాటి బాలయ్యల లెక్కలు ఎప్పటికి తేలుతాయి అంటూ ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి..     


మరింత సమాచారం తెలుసుకోండి: