ఈ మద్య భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తీస్తున్న సినిమాలు థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత అంచనాలన్నీ తలకిందులు చేస్తున్న విషయం తెలిసిందే.  ఇక చిన్న బడ్జెట్ లో తీసిన సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అవుతూ..బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నాయి.  ఈ సంక్రాంతి బరిలో క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మిశ్రమ స్పందనతో కలెక్షన్లు అంతంత మాత్రమే వసూళ్లు చేశాయి.  ఇక మాస్ దర్శకులు బోయపాటి శ్రీను, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబోలో వచ్చిన సినిమా ‘వినయ విధేయ రామ’ఎన్నో అంచనాలతో రిలీజ్ అయినా..ఎలాంటి అంచనాలు అందుకోలేక పోయింది.  రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో మిశ్రమ స్పందన రావడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది.
Image result for ఎఫ్ 2 కలెక్షన్స్
 బోయపాటి, రాంచరణ్ కి ఉన్న క్రేజ్ తో 50 కోట్లు షేర్లు వసూళ్లు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  ఇక అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రిన్ నటించిన ‘ఎఫ్ 2’సినిమాలో తొలి రోజు నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. పెద్ద సినిమాల్లా యాభైకోట్ల రేంజ్ కు అప్పుడే వెళ్లలేకపోయినా, ఫస్ట్ వీక్, సిటీ షేడ్ లాంటి రికార్డులను క్రియేట్ చేస్తోంది. కాకినాడలో తొలివారం షేర్స్ లో ఎఫ్ 2 భరత్ అనే నేను, రంగస్థలం, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్ లాంటి వాటిని అధిగమించింది. ఎఫ్ 2 సినిమా తొలివారమే ఓవర్ సీస్ తో సహా దాదాపు అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయిపోవడం విశేషం.
Image result for ఎఫ్ 2 కలెక్షన్స్
ఉత్తరాంధ్ర కలెక్షన్ల షేర్ తొలివారమే అయిదుకోట్ల సమీపంలోకి వచ్చేసింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సింగిల్ థియేటర్ రికార్డులో ఎఫ్ 2 బాహుబలి2, రంగస్థలం తరువాత మూడో ప్లేస్ లో నిల్చుంది. కాగా ‘ఎఫ్ 2’ 6వ రోజుకు గానూ నైజాంలో 1.59 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటికే ముప్పై మూడు కోట్ల మార్క్ ను దాటిన ఈ సినిమా.. ఈజీగా ఏభై కోట్లను క్రాస్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.  దిల్ రాజు నిర్మించిన ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: