ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ ఫలితం కమర్షియల్ గా నిరాశ పరిచినా ప్రశంసలు దక్కుతూ ఉండటంతో ఈమూవీ రిజల్ట్ ను లెక్కచేయకుండా బాలకృష్ణ మళ్ళీ ఈమూవీకి సంబంధించిన ప్రమోషన్ ను ప్రారంభించాడు. ఇలాంటి పరిస్థితులలో ఒక ప్రముఖ ఛానల్ కు బాలకృష్ణ క్రిష్ లు కలిపి ఇచ్చిన ఇంటర్వ్యూలో  బాలయ్య తనకు ఇష్టమైన  హీరోయిన్ల గురించి అదేవిధంగా తనకు నచ్చిన హీరోల గురించి వారు నటించిన సినిమాలలో తనకు ఇష్టమైన వాటిగురించి వివరించాడు. 
బాలయ్య ఆశలకు చెక్ పెట్టిన విక్రమ్ !
 హీరోయిన్స్ విషయమై స్పందిస్తూ స్మార్ట్ అంటే శ్రేయ ఫన్నీ అంటే అంజలి కష్టపడే తత్వం అనుష్కలో ఉందని  బాలయ్య అభిప్రాయపడ్డాడు. ఇక సినిమా షూటింగ్ సమయంలో చిన్నపిల్లలా ఎవరు ప్రవర్తిస్తారు అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ రాధికా ఆప్టే పేరు చెప్పాడు. ఇదే సందర్భంలో హీరోలవిష్యం లో  కూడా తన ఛాయస్ చెప్పేసాడు. 
సంబంధిత చిత్రం
అందగాడు ఎవరంటే తన పేరే చెప్పుకున్న బాలయ్య లవర్ బాయ్ అంటే మాత్రం ఎక్కువ ఆలోచించకుండ నాగార్జున పేరు చెప్పాడు. రెబెల్ స్ట్రార్ కు  కృష్ణంరాజు రేంజ్ రానాలో తనకు కనిపిస్తోంది అని చెప్పిన బాలయ్య   తనకు బాగా ఇష్టమైన  సినిమా ‘సమరసింహారెడ్డి’ అంటున్నాడు. ఇదే సందర్భంలో మాట్లాడుతూ ఇతర హీరోల సినిమాల్లో తనకు బాగా  ఇష్టమైన సినిమాల గురించి ప్రస్తావిస్తూ అమితాబ్ బచ్చన్ ‘అగ్ని పథ్’ అని చెపుతూ చిరంజీవి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ తాను అనేకసార్లు చూసిన విషయాలను బయటపెట్టాడు. 
Nandamuri Balakrishna. YouTube
ఇదే ఇంటర్వ్యూలో బాలకృష్ణతో కలిసి పాల్గొన్న క్రిష్ మాట్లాడుతూ  ఒకవేళ ‘ఆదిత్య 369’ రీమేక్ చేయాల్సి వస్తే మోక్షజ్ఞను ఎంచుకుంటానని రౌడీ ఇన్ స్పెక్టర్ కళ్యాణ్ రామ్ తో ‘భైరవ ద్వీపం’ జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తాను అంటూ బాలయ్యకు షాక్ ఇచ్చాడు. అయితే ‘సమరసింహారెడ్డి’ మూవీని రీమేక్ చేయాలిసి వస్తే ఆ సినిమాను బాలకృష్ణతోనే రెండో సారితీస్తాను అంటూ బాలయ్యకు జోష్ ను ఇచ్చాడు క్రిష్. ఇదే సందర్భంలో ‘కథానాయకుడు’ సినిమా గురించి బాలకృష్ణ మాట్లాడుతూ ఈసినిమాను తాను కలక్షన్స్ కోసం తీయలేదని తన ఆత్మసంతృప్తి కోసం తీశాను అంటూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: