టివిలో జబర్ధస్త్ కామెడి షో తో పరిచయం అయిన అనసూయ తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించింది.  మత్తెక్కించే చూపులు..చలాకీ మాటలు.. మతులు పోయేలా డ్రెస్సింగ్  వేస్తూ కుర్రాళ్ల మనసు కొల్లగొట్టింది.  యాంకర్ గా పలు ఛానల్స్ లో బిజీ బిజీగా మారిపోయింది.  ప్రస్తుతం వెండి తెరపై కూడా తన సత్తా చాటుతుంది అనసూయ.  గతంలో సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున సరసన నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.  ఆ తర్వాత ఒకటీ రెండు సినిమాల్లో నటించింది.  సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత నటించిన ‘రంగస్థలం’సినిమాలో రంగమ్మత్తగా అనసూయకు మంచి పేరు వచ్చింది. 
Image result for anasuya yatra movie
ఆ తర్వాత వరుసగా సినిమాల్లో ఛాన్సులు రావడం మొదలయ్యాయి.  ప్రస్తుతం బయోపిక్ సినిమాలు వస్తున్న నేపథ్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’సినిమా తీస్తున్నారు.   ఈ సినిమాలో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అనసూయ  కర్నూల్ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పాత్రలో నటిస్తుంది.  కాగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో 2004 లో కాంగ్రెస్ పార్టీ తరపున నందికొట్కూరు నియోజిక వర్గం నుండి పోటీ చేసి చరితా రెడ్డి ఏవిందంగా గెలిచింది పార్టీ కోసం ఆమె కష్ట పడిన తీరును అనసూయ పాత్ర ద్వారా సినిమలో చూపించనున్నారు. 
Image result for mammootty yatra
ఈ సినిమాలో కూడా అనసూయ ‘రంగస్థలం’సినిమాల్లో లాగే డి గ్లామర్ గా కనిపించబోతుందట.  ప్రస్తుతం షూటింగ్ షరవేగంగా జరుపుకుంటున్న ‘యాత్ర’మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, పోస్టర్లు వెలువడ్డాయి.  ప్రముఖ నటుడు జగపతి బాబు వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి పాత్రలో నటిస్తున్నారు. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించగా.. 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంఫై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న తెలుగు తోపాటు మలయాళం, తమిళ భాషల్లో విడుదలకానుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: