సాధారణంగా చరణ్ సినిమాల న్నింటిలో చిరంజేవి ,  చేర్పులు చేస్తుంటాడు . అయితే వినయ విధేయ రామ సినిమా ను అస్సలు చిరు చూడలేదని అర్ధం అవుతుంది. సైరా వల్ల తీవ్ర ఒత్తిడిలో ఉండటంతో వివిఆర్ ఫైనల్ కట్ చూసే తీరిక లేకపోయిందట. బోయపాటి కాబట్టి నమ్మొచ్చులే అనే నమ్మకంతో చిరు లైట్ తీసుకోవడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. అయితే దీనికి బలం చేకూర్చేలా వినయ విధేయ రామ విడుదలైన రెండు రోజుల తర్వాత కుటుంబ సమేతంగా చిరు ప్రత్యేకంగా షో వేయించుకుని చూశారు.

Image result for vinaya vidheya rama

సాధారణంగా హిట్ అయినా ప్లాప్ అయినా అదే పనిగా చరణ్ సినిమాను చిరు రెండోసారి ఇలా పబ్లిక్ థియేటర్లో చూసిన దాఖలాలు లేవు. వివిఆర్ ను మాత్రమే చూసారు అంటే ప్రీ రిలీజ్ లో చూడలేదన్న క్లారిటీ వచ్చినట్టేగా. అక్కడే శీను చిరు గైడెన్స్ ని మిస్ అయ్యాడు.ఇది అనుకోకుండా జరిగిందా లేదా మరొకటి ఏదైనా ఉందా అనేది పక్కన పెడితే చిరు నిజంగా చూసి ఉంటే ఇంత మితిమీరిన మసాలాలు వద్దనేవారని చెబుతున్నారు .

Image result for chiranjeevi

షూటింగ్ స్పాట్ కు వచ్చి అప్పుడప్పుడు రషెస్ చూసినా దాని బట్టి టోటల్ అవుట్ పుట్ ఎలా ఉంటుందో ఊహించడం ఎవరికైనా అసాధ్యమే. అందుకే కేవలం ట్రైలర్ ని చూసే ప్రీ రిలీజ్ లో సినిమాను బోయపాటిని చిరు ఓ రేంజ్ లో పొగిడారన్న మాట. ఏదైతేనేం వినయ విధేయ రామ రామ్ చరణ్ చేయకూడని సినిమాగా అభిమానుల నుంచి సైతం విమర్శలు అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: