తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హర్రర్, కామెడీ చిత్రాలతో తనదైన మార్క్ చాటుకున్నాడు ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకులు, నటుడు లారెన్స్ రాఘవేంద్ర.  ఒక చిన్న కొరియోగ్రాఫర్ గా తన ప్రస్థానం మొదలు పెట్టిన లారెన్స్ తర్వాత నటుడిగా, దర్శకుడిగా తన సత్తా చాటాడు.  ముని లాంటి హర్రర్, కామెడీ లాంటి చిత్రంతో తెలుగు, తమిళ ప్రేక్షకులను బాగా ఆకర్శించాడు. ఈ చిత్రం సీక్వెల్ గా కాంచన, గంగా చిత్రాలతో మరోసారి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. 
Related image
ప్రస్తుతం కాంచన 3 చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు లారెన్స్.  ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.  ఈ చిత్రం తెలుగు, తమిళంలో  లారెన్స్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ చిత్రాన్ని తెలుగులో లైట్‌హౌస్‌ మూవీమేకర్స్‌ ఎల్‌ఎల్‌పీ పతాకంపై బి. మధు సమర్పణలో రాఘవేంద్ర ప్రొడక్షన్‌ బ్యానర్‌లో రాఘవ నిర్మిస్తున్నారు.
Related image
ఈ చిత్రంలో ఓవియా, వేదిక, కోవై సరళ, కబీర్‌ దుహన్‌ సింగ్, సత్యరాజ్, శ్రీమాన్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు చిత్రయూనిట్. అన్నికార్యక్రమాలు పూర్తి చేసి వేసవి సెలవుల్లో ఏప్రిల్‌ 18న సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: