టాలీవుడ్, కోలీవుడ్ లో 90వ దశకంలో స్టార్ హీరోల సరసన నటించిన రమ్యకృష్ణ గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంది.  ఇప్పటి వరకు ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించిన రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత అత్త, అమ్మ పాత్రల్లో నటిస్తుంది.  రాజమౌళి దర్శకత్వంలో నటించిన బాహుబలి, బాహుబలి2 లో శివగామిగా రమ్యకృష్ణ నటనకు ఎంతో మంచి పేరు వచ్చింది.  ప్రస్తుతం తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో నటిస్తుంది రమ్యకృష్ణ. తాజాగా ఆమె త‌మిళ మూవీ సూప‌ర్ డీల‌క్స్ లో  న‌టిస్తున్న‌ది. 
Image result for ramya krishna super deluxe movie
ఈ సినిమాకు త్యాగ‌రాజ‌న్ కుమార‌రాజా ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. దర్శకుడు త్యాగరాజన్ ఈ సినిమా విశేషాలు వెల్లడిస్తూ..ఈ సినిమాలో ప్రముఖ నటి రమ్యకృష్ణ ఒక ఫోర్న్ స్టార్ గా కనిపించబోతుందని..ఈ వయసులో కూడా ఆమె ఎంతో అద్భుతమైన నటన ప్రదర్శించిందని  ప్ర‌శంసించాడు. 
Related image
వాస్తవానికి ఆ పాత్ర కోసం ముందుగా నదియాను సంప్రదించామని ఈ వయసులో ఆ పాత్ర తాను చేయలేనని అనడంతో ఈ కథ రమ్యకృష్ణకు వివరించగా తాను ఆ పాత్ర ఎంతో ఛాలెంజ్ గా తీసుకొని నటించిందన్నారు.   ర‌మ్య‌కృష్ణ కెరీర్ లో ఈ పాత్ర చిర‌స్థాయిగా నిలిచిపోతుంద‌నే ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశాడు.  ఈ సినిమాలో విజయ్ సేతుప‌తి, స‌మంత‌, ఫ‌హాద్ ఫాసిల్, మిస్కిన్ లు కీల‌క‌పాత్ర‌ల్లో నటిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: