అదేంటో టాలీవుడ్ కి ఈ మధ్యకాలం అంతగా కలసిరావడంలేదు. ఒకపుడు కాసుల వర్షం కురిసిన తెలుగు సినిమా ఇపుడు బేల చూపులు చూస్తోంది. పెరిగిన సాంకేతికత సినిమాను వైపు చంపేస్తూంటే, పైరసీ  భూతం ఇంకోవైపు విరుచుకుపడుతూ అసలుకే ఎసరు పెడుతోంది. దాంతో సినిమా భవిషత్తు అగమ్యగోచరరంగా ఉంది.


సంక్రాంతి అన్నది తెలుగు సినిమాకు పెద్ద పండుగగా నిజానికి ఎక్కడ లేని సినిమాలు విడుదల అయి కాసులు దండీగా చేసుకునే అసలైన పండుగ. కానీ గత రెండేళ్ళ నుంచి సంక్రాంతి టాలీవుడ్ కి అచ్చిరావడంలేదు. 2017న బాలక్రిష్ణ శాతకర్ణి, మెగాస్టార్ ఖైదీ మూవీస్ సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. అంతే కాదు, మధ్యలో వచ్చిన శతమానం భవతి మూవీ కూడా హిట్ అయి టాలీవుడ్ కి గుడ్ బిగినింగ్ తెచ్చింది.


అయితే 2017 వచ్చేసరికి ఆ సుడి తిరగబడింది. భారీ అంచనాల మధ్యన వచ్చిన పవన్ సినిమా అజ్ణాతవాసి ఫ్లాప్ అయింది. బాలయ్య జై సిమ్హా మూవీ ఏవరేజ్ టాక్ తెచ్చుకుని పండుగను సరిపెట్టేసింది. ఇక ఈ ఏడాది సంక్రాంతి సైతం అలాగే సాగిపోయింది. బాలయ్య కధానాయకుడు మూవీకి టాక్ బాగున్నా కలెక్షన్లు లేవు. చరణ్ మూవీ వినయ విధేయ రామ మూవీ జనానికి నచ్చలేదు. ఒక్క సినిమాగా ఎఫ్ 2 మాత్రం హిట్ అయింది. నిజానికి సంక్రాంతి పండుగకు నాలుగైదు మూవీస్ రిలీజ్ అయినా హిట్లు కొట్టే స్టామినా ఉంది. అంత పెద్ద మార్కెట్ ని టాలీవుడ్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోతోంది.


ఈ నేపధ్యంలో ఈ ఏడాది బంపర్ హిట్లు పడాలీ అంటే ఆ మూడు మూవీస్ పైనే అంతా ఆశలు పెట్టుకున్నారు. అందులో ఒకటి మహేష్ నటించిన మహర్షి. ఇది ఏప్రిల్లో వస్తోంది. రెండవది ప్రభాస్ సాహో ఈ మూవీ ఆగస్ట్ రిలీజ్ అంటున్నారు. మూడవది సైరా మూవీ. ఇది దసరా రిలీజ్. ఈ మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్లు కొడితేనే టాలీవుడ్ కోలుకునేది. కళకళలాడేది. ఇక రాజమౌళి మూవీ ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాదికి కానీ సిధ్ధం కాదు. దాంతో అందరి చూపూ ఈ మూవీస్ మీదనే ఉంది. మరి టాలీవుడ్ కి మంచి రోజులు ఈ మూడూ తెస్తాయా. వైట్ అండ్ సీ.


మరింత సమాచారం తెలుసుకోండి: