స్వీట్ అంటే అమ్మాయే..హాట్ అంటే కూడా అమ్మాయే. ఇదెక్కడి పోలిక అంటే మాత్రం చెప్పలేరంతే. అందాన్ని ఎలా అయినా తిప్పొచ్చు. చెప్పొచ్చు. వంపు సొంపులతో గింగిరాలు తిప్పేసే సుందరాంగులకు ఇదొక లెక్కా. చలికి సైతం గిలిపెట్టే చక్కిలిగిలి మా సొంతం అని చెప్పే సొగసుగత్తెల సవాల్ కి జవాబు ఏముంటుంది. అందాలను ఆస్వాదించడం తప్ప.


ఓ వైపు బీచ్. కెరటాల ఆరాటం దానిది. యుగాలు ఎన్ని జరిగినా దాని తపన ఆగిపోదు. హద్దులు చెరిపేసుకుని ముందుకు ఉరకాలనుకుంటూనే ఉంటుంది. మరో వైపు నెరజాణ పరువాల  పరవళ్ళు కూడా అలాగే పోటీ పడితే చూసే కళ్ళకు ఇక్కట్లు  తప్పదేమో. మిస్ ఇండియా 2013 భామ హాట్ బ్యూటీ శోభిత ధూళిపాళ పేరు తెలియని ఈ జనరేషన్ తెలుగు ఆడియన్స్ దాదాపుగా ఉండరు.  'గూఢచారి' లాంటి హిట్ సినిమాలో హీరోయిన్ గా నటించడమే కాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తరచుగా హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శ్రీలంక ట్రిప్ లో ఉన్న ఈ భామ అక్కడ ఒక బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది.


ఈ పొస్ట్ చూస్తే చాలు యూత్ కి పూనకాలు వచ్చేస్తోంది. మరీ ఇంత హాటా అంటూ తట్టుకోలేకపోతున్నారు నెటిజన్లు.  దాదాపు మేకప్ లేకుండా  తడిగా ఉన్న జుట్టును చేత్తో అలా పైకి అనుకుంటున్నట్టుగా పోజిచ్చింది.  సైడ్ యాంగిల్ లో ఫోటో తీయడంతో కళాత్మకంగా ఉంది.  తలపైన వేలాడుతున్న కొబ్బరి ఆకులు ఫోటోకు మరింత అందాన్నిచ్చాయి. 
అచ్చ తెలుగు అందమిలా హీటిక్కిస్తూంటే బాలీవుడ్ వెంట పరుగులు తీయడం ఎందుకన్న సందేహం అందరికీ వస్తుంది. శోభిత తన హాట్ హాట్ పరువాలతో విరహాన్ని తెప్పిస్తూనే తెలుగు భామల సత్తా ఎంటో చెప్పకనే చెప్పేసింది. బీచ్ అందాన్ని సైతం బీటౌట్  చేస్తూ శోభిత కొట్టిన ఈ అందం దెబ్బకు యువ గుండేలు బద్దలవుతాయంటే అందులో ఆశ్చర్యం ఏముంటుంది. చూపులతో కొరుక్కుతిను అంటూ ఈ హాటీ కవ్విస్తూంటే డంగ్ అయిపోవడం తప్ప కుర్ర కారు కు మరేంలేదుగా. 


మరింత సమాచారం తెలుసుకోండి: