తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య యువ దర్శకులు బాగా రాణిస్తున్నారు.  పెళ్లి చూపులు చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన తరుణ్ భాస్కర్ ఈ తర్వాత ఈ నగరానికి ఏమైంది అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.  ఇక పెళ్లి చూపులు చిత్రంతో విజయ్ దేవరకొండకు మంచి ఫ్లాట్ ఫామ్ లభించిన విషయం తెలిసిందే.  ఆ చిత్రం తర్వాత మనోడు వరుస విజయాలు అందుకుంటున్నాడు.  తాజాగా విజయ్ దేవరకొండ నిర్మాతగా తరుణ్ బాస్కర్ హీరోగా ఓ చిత్రం రూపొందబోతుంది. 
Image result for vijay devarakonda tarun bhaskar
ఓ వైపు చిత్రాల్లో నటిస్తూనే..వస్త్ర వ్యాపార రంగంలో సత్తా చాటుతున్నాడు విజయ్ దేవరకొండ.  ఇటీవ‌లే కింగ్ ఆఫ్ ద హిల్స్ అనే ప్రొడక్షన్ హౌజ్ ని స్టార్ట్ చేసాడు . ఈ సంస్థ ద్వారా తొలి చిత్రాన్ని నిర్మించ‌నున్నాడు.. త‌రుణ్ హీరోగా న‌టిస్తున్న ఈ మూవీలో అన‌సూయ‌ను హీరోయిన్ గా తీసుకున్నారు.
Image result for anasuya
రంగస్థలం చిత్రంతో అనసూయ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే.  వ‌చ్చే నెల‌లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. మరి దర్శకుడిగా ఉన్న తరుణ్ భాస్కర్ హీరోగా ఎంత వరకు రాణిస్తాడు..నిర్మాతగా విజయ్ దేవరకొండ సక్సెస్ అందుకుంటాడా చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: