‘గబ్బర్ సింగ్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ లో పవన్ కళ్యాణ్ మ్యానియాతో పాటు ఆసినిమా అంత్యాక్షరి సీన్ లో నటించిన ‘గబ్బర్ సింగ్’ బ్యాచ్ నటుల ప్రభావం కూడ ఉంది అన్న విషయం అందరు అంగీకరించే నిజం. ‘గబ్బర్ సింగ్’ సూపర్ హిట్ అవ్వడంతో ఆసినిమాలోని అంత్యాక్షరి ప్యారిడీ సీన్స్ ను ఇమిటేడ్ చేస్తూ అనేక సినిమాలలో అదే తరహా ప్రయోగాలు చేసినా ఆప్రయోగాలు పెద్దగా సక్సస్ కాలేదు.

అయితే ‘గబ్బర్ సింగ్’ బ్యాచ్ కి ఆమూవీ తరువాత అనేక అవకాశాలు రావడమే కాకుండా వారంతా చిన్న సైజ్ సెలెబ్రెటీలుగా మారిపోయి చిన్నచిన్న ఫంక్షన్స్ కు అతిధులుగా వెళ్ళే స్థాయికి వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థుతులలో ఈమధ్య నెల్లూరులో జరిగిన సంక్రాంతి ఫెస్టివల్ కార్యక్రమానికి అతిధులుగా వెళ్ళిన ‘గబ్బర్ సింగ్’ బ్యాచ్ పవన్ కళ్యాణ్ కు ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చింది.

తమ దృష్టిలో పవన్ కళ్యాణ్ దేవుడు కంటే ఎక్కువ అని కామెంట్ చేస్తూ పవన్ అంగీకరిస్తే తామంతా తమ సొంత ఖర్చులతో ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలలో పవన్ ‘జనసేన’ కోసం ప్రచారం చేస్తూ పవన్ ఎంత మంచివాడో అందరికీ తెలిసేలా చేస్తాము అంటూ ఓపెన్ ఆఫర్ ఇస్తోంది ఈ గబ్బర్ సింగ్ బ్యాచ్. తమలాంటి చిన్నచిన్న నటులతో హీరోలు కనీసం పలకరించరని అలాంటి పరిస్థుతులలో పవన్ తమను తన ఇంటికి పిలిచి భోజనం పెట్టడమే కాకుండా తమకు బహుమతులు ఇచ్చిన విషయాన్ని జీవితంలో మరిచిపోలేము అంటూ ‘గబ్బర్ సింగ్’ బ్యాచ్ అలనాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటోంది. 

అయితే ఈవిషయం పై కూడ పవన్ తన సహజ సిద్ధమైన మౌనాన్ని కొనసాగిస్తూ ఎటువంటి స్పందన లేదు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న ఈసమయంలో ‘జనసేన’ కోసం పనిచేస్తాను అని వస్తున్న ఇండస్ట్రీ వ్యక్తులను కూడ పవన్ దూరం పెడుతున్న నేపధ్యంలో రాజకీయాలలో పవన్ కు నచ్చిన వ్యక్తులు ఎవరు అన్న విషయం సమాధానం లేని ప్రశ్నగా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: