ఇండస్ట్రీ లో సక్సెస్ రేట్ ను మైంటైన్ చేసే దర్శకులకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే రీసెంట్ గా F 2 తో మంచి విజయాన్ని స్వంతం చేసుకున్న అనిల్ రావిపూడి కి ఇప్పడూ ఎక్కడ లేని డిమాండ్ ఏర్పడింది. వరుసగా నాలుగవ విజయాన్ని అందుకున్న ఈ యువ దర్శకుడు ఇంతవరకు తీసిన ఏ సినిమా కూడా అద్భుతం అనిపించదు. పాత్‌ బ్రేకింగ్‌ ఐడియాస్‌తో తెలుగు సినిమాని కొత్త పుంతలు తొక్కించే తత్వం అతనిలో వుండదు. ప్రేక్షకుల అభిరుచి మారిపోయిందని, వారికి కొత్త ఐడియాలే నచ్చుతున్నాయని రావిపూడి భావించడు. క్రిటిక్స్‌ని మెప్పించే ప్రయత్నాలు అసలే చేయడు.

Image result for anil ravipudi

సగటు తెలుగు సినీ ప్రియులు ఎలాంటి చిత్రాలని ఇష్టపడతారో, ఏ తరహా కాన్సెప్టులని, కామెడీని లైక్‌ చేస్తారో రావిపూడికి బాగానే తెలుసు. బాక్సాఫీస్‌ పల్స్‌ తెలిసిన అతి కొద్దిమంది యువ దర్శకులలో అతనొకడు. ఎఫ్‌2తో కెరీర్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ అందుకున్న అనిల్‌ రావిపూడికి ఇప్పుడు ఫుల్‌ డిమాండ్‌ వుంది. ఇకపై కూడా ఇదే తరహాలో జనరంజక చిత్రాలు తీస్తానంటున్న అనిల్‌ రావిపూడి ఇంతవరకు భారీ చిత్రాలేమీ చేయలేదు.

Image result for anil ravipudi

అతని ఐడియాలు, కమర్షియల్‌ ఫార్ములా అంతగా అంచనాలు లేని మీడియం బడ్జెట్‌ చిత్రాలకి సరిపోతున్నాయి కానీ భారీ పెట్టుబడి పెట్టిన భారీ సినిమాలకి అతనికి ఫార్ములా పని చేస్తుందా అనేది ఇంకా తెలీదు. వందకోట్ల మార్కెట్‌ కావాలంటే కేవలం కొన్ని నవ్వులు, కమర్షియల్‌ ఎలిమెంట్సు చాలవు. అవి వర్కవుట్‌ అవ్వాలంటే 'ఎక్స్‌ ఫ్యాక్టర్‌' తప్పనిసరి. మరి అనిల్‌ రావిపూడిలో భారీ చిత్రాలను డీల్‌ చేసే సత్తా వుందా? స్టార్‌ హీరోలతోను ఇలాగే సక్సెస్‌ కాగలడా?

మరింత సమాచారం తెలుసుకోండి: