ఇప్పటికే రెండు ఘోర పరాజయాలు అఖిల్ ను వెంటాడటంతో ‘మిస్టర్ మజ్ను’ ఫలితం అఖిల్ కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది. అయితే నిన్న విడుదల అయిన ఈమూవీ ట్రైలర్ ఈమూవీ ఒక సింపుల్ లవ్ స్టొరీ అని చెప్పే విధంగా దర్శకుడు వెంకీ అట్లూరి ఈ ట్రైలర్ ద్వారా  అనుసరించిన వ్యూహాలు ఈ మూవీ ట్రైలర్ కు పెద్దగా కలిసిరాలేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. 
Mr. Majnu Telugu Movie
దీనికితోడు నిన్న విడుదలైన ‘మిస్టర్ మజ్ను’ ట్రైలర్ పెద్దగా యూత్ కు కనెక్ట్ కాలేదు అన్నవార్తలు వస్తున్నాయి. ‘ఆరంజ్’ సినిమాలో రామ్ చరణ్ మాదిరిగా పెళ్లికి దారితీసే ప్రేమకు దూరంగా వుండే కుర్రాడి కథ ‘మిస్టర్ మజ్ఞు’ గా మరొకసారి చూడబోతున్నామా అంటూ అఖిల్ అభిమానులు కూడ భయపడుతున్నట్లు టాక్.  
Mr Majnu Theatrical Trailer
వాస్తవానికి వెంకీ అట్లూరి మంచి సంభాషణలు రాసుకుంటాడు అన్న పేరు ఉంది. ఆ సంభాషణల ద్వారా సినిమాలలోని సన్నివేశాలకు బలం తీసుకురాగాలిగితే సినిమా సక్సస్స్ అవుతుంది. ' నా కోసం ఎంతమంది ఏడ్చినా నాతప్పు అని అనుకోను కానీ, నా వల్ల ఒక్కరు ఏడ్చినా అది ముమ్మాటికీ నా తప్పే' అన్న డైలాగు  అదే విధంగా, 'కాస్సేపు ప్రేమించి ఆతరువాత ఇంకా ఎక్కువ ప్రేమించి ఆపై మరింత ప్రేమించి పెళ్లి చేసుకునే టైపు లవ్వా? చచ్చాంపో అది అయితే అస్సలు చాతకాదు' అంటూ అఖిల్ నోటివెంట వచ్చిన దైలాగులను వింటూ ఉంటే ‘మిస్టర్ మజ్ను’ ఆరంజ్ కు సీక్వెల్ గా మారబోతొందా  అన్న సందేహాలు వస్తున్నాయి.  

దీనికితోడు ‘మిస్టర్ మజ్ఞు’ టీజర్ కట్ చేసినంత అట్రాక్టివ్ గా ట్రయిలర్ కట్ చేయడంలో డైరక్టర్ వెంకీ అట్లూరి ఎందుకు ఫెయిల్ అయ్యాడు అన్న విషయమై ఆసక్తికర చర్చలు జరిగుతున్నాయి. ఈవిషయాలు అన్నీ నాగార్జున దృష్టి వరకు రావడంతో ‘మిష్టర్ మజ్ను’ పై అప్పుడే నెగిటివ్ ప్రచారం ప్రారంభం అయిందా అంటూ ఆశ్చర్యపోతున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: