‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ’ విషయంలో తన స్పీడ్ పెంచిన వర్మ ఈరోజు సోషల్ మీడియాలో షేర్ చేసిన వెన్నుపోటు ఫోటో కలకలం రేపుతోంది. ‘బాహుబలి’ లో కట్టప్ప అమరేంద్ర బాహుబలిని ‘బాహుబలి’ ని కత్తితో వెన్నుపోటు పొడుస్తున్న ఫోటోకు మాస్క్ లు పెట్టి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పోడుస్తున్నట్లుగా గ్రాఫిక్ డిజైన్ చేసిన ఫోటోను ఈరోజు షేర్ చేసి మరొక సంచలనానికి శ్రీకారం చుట్టాడు.
Lakshmi's NTR, Ram Gopal Varma
ఫోటోషాప్‌లో గ్రాఫిక్స్ చేసిన ఇమేజ్ ని ట్విటర్లో పోస్ట్ చేసిన వర్మ ‘ ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులు నాకు సరిగా గుర్తుకు రావడం లేదు వీరిని గుర్తు పట్టడంలో నాకు సాయం చేయండి’ అంటూ సెటైరికల్‌గా కామెంట్ చేయడమే కాకుండా మరొకసారి జనానికి ఎన్టీఆర్ వెన్నుపోటు సంఘటనను గుర్తుకు వచ్చేలా చేసాడు.  

ఇప్పుడు ఈఫోటో సోషల్ మీడియాలో నేటి ట్రెండింగ్ ఫోటోగా మారింది. ఈఫోటోను చూసిన నందమూరి అభిమానులు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్రలో యాగ్నశెట్టి నటిస్తుంటే ఎన్టీఆర్ పాత్రలో  పశ్చిమ గోదావరిజిల్లాకు చెందిన శ్రీతేజ్ అనే డ్రామా ఆర్టిస్ట్ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నాడు. 
Ram Gopal Varma
ఎన్నికల ముందు రాబోతున్న సినిమా కావడంతో ఈమూవీ విషయంలో తెలుగుదేశం వర్గాలు తీవ్ర కలత చెందుతున్నట్లు సమాచారం. వివాదాలను సినిమా కలక్షన్స్ గా మార్చుకోవడంలో దిట్ట అయిన వర్మ రాబోయే రోజులలో ఈసినిమాకు సంబంధించి ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: