ఈ మద్య బయోపిక్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  సినీ రాజకీయా క్రీడా ప్రముఖుల జీవిత కథల నేపథ్యంలో పలు భాషల్లో సినిమాలు రూపొందుతున్నాయి. ఈ లిస్ట్‌లో ఓ సైంటిస్ట్‌ కూడా చేరబోతున్నాడు. కెరీర్‌లో విభిన్న పాత్ర‌లని పోషిస్తూ అభిమానుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని స్థానం సంపాదించుకున్న న‌టుడు మాధ‌వ‌న్‌. కేవ‌లం ప్ర‌ధాన పాత్ర‌ల‌లోనే కాకుండా స‌పోర్టింగ్ రోల్స్‌లోను న‌టిస్తూ మెప్పిస్తున్నాడు. తెలుగులో ఇటీవ‌ల నాగచైతన్య నటించిన ‘స‌వ్య‌సాచి’సినిమాలో విలన్ గా నటించాడు. 
madhavan scientist look revealed
ప్ర‌స్తుతం ఇస్రో శాస్త్ర‌వేత్త నంబి నారాయ‌ణ‌న్ బ‌యోపిక్‌లో న‌టిస్తున్నాడు మాధ‌వ‌న్. ఈ సినిమా స్వ‌యంగా తెర‌కెక్కిస్తూ న‌టిస్తున్నాడు. ఈ సినిమా కోసం మాధవన్ చూపిస్తున్న డెడికేషన్‌ అందరిని విస్మయానికి గురిచేస్తుంది. ఇప్పటికే తన లుక్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌తో ఆకట్టుకుంటున్న మాధవన్‌ తాజాగా తన ఫైనల్‌ లుక్‌ను రివీల్ చేశాడు. 14 గంట‌ల త‌ర్వాత పూర్తిగా మారిపోయిన నేను నంబినారాయ‌ణ‌న్ లుక్‌లోకి పూర్తిగా ఒదిగిపోయాను. ఒరిజిన‌ల్ ఎవ‌రో డూప్లికేట్ ఎవ‌రో గుర్తుప‌ట్టలేకున్నంత‌గా మారిపోయాను అని మాధ‌వ‌న్ స్ప‌ష్టం చేశాడు. 

నంబి నారాయ‌ణ‌న్ పాత్రను ఆయన ఎంత అంకితభావంతో చేస్తున్నాడనేది అందుకు సంబంధించిన ఫోటోలు చూస్తే తెలిసిపోతుంది.  ఈ సినిమాలో మూడు విభిన్న పాత్ర‌ల‌లో మాధ‌వ‌న్ క‌నిపించ‌నున్నాడ‌న్న‌మాట‌.  సినిమా కోసం దర్శకుడిగా రంగంలోకి దిగిన అనంత్ మహదేవన్ కొన్ని కారణాల వలన పక్కకి తప్పుకోవడంతో, దర్శకత్వ బాధ్యతలను మాధవన్ తన భుజాలపై వేసుకున్నాడు.  ఈ సినిమాను తెలుగు, తమిళ, ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: