సినిమా హీరోయిన్లు ఏదైనా ప్రారంభోత్సవాలకు వచ్చినప్పడు ఫ్యాన్స్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు.. వారిని చూసేందుకు జనం తండోపతండాలుగా వస్తుంటారు. అలాంటి సమయాల్లోనే కొందరు పోకిరీలు వెర్రి మొర్రి వేషాలు వేస్తుంటారు. బౌన్సర్ల వంటి వ్యవస్థ ఉన్నా ఇలాంటి ఆగడాలు తప్పడం లేదు

kangana ranaut కోసం చిత్ర ఫలితం


కంగనా రనౌత్ వంటి స్టార్‌కు కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పలేదట. తాను ఓ కార్యక్రమానికి వెళ్లినప్పుడు జరిగిన చేదు అనుభవాన్ని కంగన తాజాగా గుర్తు చేసుకుందిఓ వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని.. అందరి ముందే.. వెనుకభాగంలో చేయివేసి గిల్లాడని చెప్పింది.

kangana ranaut కోసం చిత్ర ఫలితం


అక్కడ గిల్లడమే కాకుండా.. ఇప్పుడు ఏం చేస్తావ్ అన్నట్టు చూశాడని.. ఆ చూపు తనకు చాలా కంపరం కలిగించిందని కంగనా చెప్పుకొచ్చింది. ఆడపిల్లలు బయటకు వచ్చినప్పుడు తమ భద్రత గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.మణికర్ణిక ప్రచారం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కంగనా ఈ విషయం వెల్లడించింది.

kangana ranaut కోసం చిత్ర ఫలితం


ఇప్పుడు మీటూ ఉద్యమం వచ్చాక మహిళలంతా తమపై జరిగిన అకృత్యాల గురించి నోరు విప్పుతున్నారని..ఇది మంచి పరిణామమని కంగనా అంటోంది. సినిమా హీరోయిన్లకు అన్నిచోట్లా లైంగక వేధింపులకు గురయ్యే ఛాన్సు ఉందని.. ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది కంగన. ఆడపిల్లలు మార్షల్ ఆర్ట్స్‌ నేర్చుకోవడం కూడా మంచిదని సలహా ఇచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: