మహేష్ కెరియర్ కు సంబంధించి 25వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న ‘మహర్షి’ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈమూవీలో  మహేష్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు. ఒక గెటప్ లో స్టూడెంట్ గా మరొక గెటప్ లో బిజినెస్ మ్యాన్ గా కనిపించబోయే మహేష్ లుక్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే లీక్ అయ్యాయి.

దీనితో మహేష్ నటించబోయే మూడవ లుక్ ఎలా ఉంటుంది అన్న విషయమై ఇప్పుడు మహేష్ అభిమానులలో ఆతృత పెరిగింది. దీనికి సమాధానంగా నిన్న మహేష్ భార్య నమ్రత పుట్టినరోజునాడు సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేసారు. ఈఫోటోలో మహేష్ క్లీన్ షేవ్ తో కనిపిస్తున్నాడు. 
A still from Maharshi teaser, featuring Mahesh Babu. YouTube screengrab
రెగ్యులర్ గా ఉండే చిన్నపాటి మీసం కూడ తీసివేయడంతో మహేష్ క్లీన్ షేవ్ లుక్ వెరైటీగా కనిస్తోంది. అయితే ఈ క్లీన్ షేవ్ లుక్ మహేష్ కు ఏమాత్రం బాగుండలేదని అభిమానులు అభిప్రాయపడుతూ గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే ఈసినిమా కథ ‘శ్రీమంతుడు’ పార్ట్ 2గా మారిందని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో మహేష్ పై ఈ కొత్త గెటప్ ప్రయోగం ఏమిటి అని అభిమానులు అసహనానికి లోనవుతున్నారు. 
Maharshi’s Second Look Poster To Come Out At 6:03 PM Today!
ప్రస్తుతం పొలాచ్చిలో మహేష్ ట్రాక్టర్ నడుపుతూ పొలం పనులు చేస్తున్న సీన్స్ చిత్రీకరిస్తున్న యూనిట్ త్వరలోనే అక్కడ నుండి వచ్చి హైదరాబాద్ లో వేసిన ఒక ప్రత్యేకమైన సెట్ లో మరొక కొత్త షెడ్యూల్ మొదలుపెదతారని తెలుస్తోంది. దీనితరువాత ఈమూవీ ఆఖరి షెడ్యూల్ ను అబుదాబిలో ప్లాన్ చేసి మహేష్ కు సెంటిమెంట్ గా కలిసి వచ్చే ఏప్రియల్ చివరి వారంలో విడుదల చేయబోతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: