ఇండస్ట్రీ లో చిరంజీవి కి మంచి పేరు ఉంది . రాజకీయాల్లో విజయవంతం కాకపోయిన ఒక వ్యక్తి గా చిరంజీవి ని గౌరవిస్తారు. ఎందుకంటే చిరంజీవిది ఆవేశ పడే స్వభావం కాదు సౌమ్యంగా ఉంటాడు . వివాదాల జోలికి పోడు ఇవన్నీ చిరంజేవి ని మెగా స్టార్ ను చేశాయని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. అయితే మొన్నటివరకు బాలకృష్ణ ను నాగబాబు టార్గెట్ చేయడం మనకు తెలిసిందే. అయితే మళ్ళీ ఇప్పుడు లోకేష్ ను టార్గెట్ చేయడం ఇది ఖచ్చితంగా పొలిటికల్ టార్గెట్ అంటున్నారు. 

Image result for nagababu

'పొలిటికల్‌ సెటైర్స్‌.. ఎవర్నీ వ్యక్తిగతంగా కించపర్చను. కానీ, సెటైరికల్‌గా వుంటాయి నా వీడియోలు..' అన్నది నాగబాబు 'కంక్లూజన్‌'. ఏ రాయి అయితేనేం, పళ్ళూడగొట్టుకోవడానికి.! అన్నట్టుంది నాగబాబు వ్యవహారం. ఇక్కడ నాగబాబు ఉద్దేశ్యం క్రిస్టల్‌ క్లియర్‌గా కన్పిస్తోంది. అల్టిమేట్‌ టార్గెట్‌ బాలకృష్ణే అన్నట్లుగా నాగబాబు అడుగులు వేస్తున్నారు. అది సుస్పష్టం. అన్నయ్య చిరంజీవి తరఫున, తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ తరఫున 'మెగా బ్రదర్‌' నాగబాబు బాధ్యతలు తీసుకుని, రాజకీయంగా, సినిమాల పరంగా తమ కుటుంబాన్ని మెచ్చే అభిమానుల్ని అలరించడానికీ, అదే సమయంలో ప్రత్యర్థి 'క్యాంపులో' అసహనపు నిప్పుల కుంపటిని రాజేయడానికీ ప్రయత్నిస్తున్నట్లుంది వ్యవహారం. 

Image result for nagababu

లేకపోతే, ఎప్పుడో చాలా నెలల క్రితం నారా లోకేష్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తనదైన స్టయిల్లో నోరు జారేసి, తెలుగుదేశం పార్టీ తాలూకు అవినీతినీ, ఆ పార్టీలో పేరుకుపోయిన కుల పిచ్చినీ, ఇతర జాడ్యాల్నీ బయటపెట్టేసిన విషయం విదితమే. ఆ 'దరిద్రాల్ని' ప్రతిపక్షం వైఎస్సార్సీపీకి ఆపాదించే ప్రయత్నంలో నారా లోకేష్‌, తమ పార్టీని భ్రష్టుపట్టించేలా నోరు జారారు. ఆ విషయమై చాలా పెద్ద రచ్చ జరిగింది. చివరికి నారా లోకేష్‌కి 'పప్పు' అన్న బిరుదు కూడా వచ్చిందనుకోండి.. అది వేరే విషయం. అయితే  నాగబాబు ఎన్నికల ముందు ఈ హడావుడి ఏంటని కొందరు పెదవి విరుస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: