పవన్ కళ్యాణ్ వీరాభిమానులు తలుచుకుంటే ఎటువంటి వార్తలైనా క్రియేట్ చేయగలరు. ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వాట్సాప్ లో హడావిడి చేస్తున్న ఒక న్యూస్ సంచలనంగా మారింది.
అభిమానులు:
BARC సంస్థ 2018కి కాను ఛానల్స్ రేటింగ్స్ కు సంబంధించి విడుదల చేసిన ఒక నివేదికను ఉదాహరణగా చూపెడుతూ పవన్ పై వ్యతిరేక ప్రచారం చేసి పవన్ వార్తలను ప్రసారం చేయకుండా అడ్డుకున్న ఒక ప్రముఖ మీడియా ఛానల్ పరిస్థితి పై పవన్ వీరాభిమానులు ఒక ఆసక్తికర విషయాన్ని షేర్ చేస్తున్నారు. గతంలో 43 టీఆర్పి పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో కొనసాగితే ఇప్పుడు ఆ ఛానల్ 23 టీఆర్పీ పాయింట్ల రేటింగ్ కు పడిపోయింది దానివల్ల ఆ ప్రముఖ చానల్స్ కు 480 కోట్లు నష్టం వచ్చింది అంటూ ఒక నివేదికను ఉదాహరణగా చూపెడుతూ పవన్ వీరాభిమానులు వాట్సాప్ లో నిన్నటి నుంచి విపరీతమైన ప్రచారం చేస్తున్నారు.  
 BARC సంస్థ:
ప్రస్తుతం ఈన్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఈ రేటింగ్స్ ప్రభావంతో చాల న్యూస్ ఛానల్స్ తమ పద్ధతి మార్చుకుని పవన్ గురించి వ్యతిరేక ప్రచారం మానివేసాయని కూడ పవన్ అభిమానులు ఒక సరికొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకువస్తున్నారు. ఈ BARC సంస్థ పేరుతో సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న నివేదికలోని విషయాలు ఎంత వరకు యదార్ధమో తెలియకపోయినా ఈ న్యూస్ పవన్ అభిమానులకు విపరీతమైన జోష్ ను ఇస్తోంది. 
వాస్తవానికి ‘జనసేన’ పార్టీకి కార్యకర్తలు పెద్దగా లేకపోయినా సోషల్ మీడియాలో మటుకు పవన్ గురించి ప్రచారం చేసే అభిమానులు లక్షల సంఖ్యలో ఉంటున్నారు.
ప్రత్యేక ఆర్టికల్స్:
దీనితో పవన్ వీరాభిమానులు అంతా రానున్న ఎన్నికలలో ఖచ్చితంగా ఓట్లు వేస్తే పవన్ ‘జనసేన’ క్రియాశీలక శక్తిగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందువల్లనే పవన్ తరుచూ తన ఉపన్యాసాలలో తన అభిమానులను ఉద్దేసించి పవన్ ‘ముఖ్యమంత్రి’ అంటూ అని నినాదాలు చేసే కన్నా వారందరికీ అసలు ఓట్లు ఉన్నాయో లేదో చూసుకుని ‘జనసేన’ కు సహకరించమని పిలుపును ఇస్తున్నాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: