ప్రస్తుతం వెండి తెరపై అనేక బయోపిక్ సినిమాలు వస్తున్నాయి.   సినీ, రాజకీయ,క్రీడా ఇతర రంగాల్లో మంచి పేరు తెచ్చుకున్న వారి జీవిత కథ ఆధారంగా సినిమాలు తీస్తున్నారు.  తెలుగులో ఇప్పటికే మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తీసిన ‘మహానటి’మంచి ఆదరణ పొందింది.  ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోక్ నుంచి మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ చేశారు.  ఈ సినిమాలో ఎన్టీఆర్ నట జీవితాన్ని ఆయన కెరీర్ లో ఎలా పైకి వచ్చారు..వెండి తెరపై తన ప్రభంజనం ఎలా కొనసాగింది అనేది చూపించారు. 
Related image
ఇక ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో రాజకీయ ప్రస్థానం చూపించబోతున్నారు.  ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’సినిమా తీస్తున్నారు.  మళియాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, రిలికల్ సాంగ్స్ కి సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభిస్తుంది. మహి వి రాఘవ్ తెరకెక్కించిన 'యాత్ర' చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డ్ ఇచ్చింది.
Image result for yatra movie
అయితే ఈ సినిమాలో కొన్ని రాజకీయ కాంట్రవర్సీలు ఉంటాయని పుకార్లు వచ్చాయి..కానీ అందరికీ షాక్ ఇస్తూ 'యూ' సర్టిఫికెట్ ఇచ్చిన బోర్డు సభ్యులు, సినిమా బాగుందని వ్యాఖ్యానించారట.  ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించిన చిత్ర యూనిట్, సెన్సార్ బోర్డు మెంబర్స్ అభినందనలు తెలిపారని పేర్కొంది.ఈ సినిమాను భలే మంచిరోజు, ఆనందో బ్రహ్మ వంటి చిత్రాలను నిర్మించిన 70 ఎంఎం ఎంటర్ టెయిన్ మెంట్స్ నిర్మించగా, వచ్చే నెల 8న ఇది విడుదల కానుంది. చాలా కాలం తరువాత మమ్ముట్టి నటించిన డైరెక్ట్ తెలుగు చిత్రం ఇదే కావడంతో సినిమాపై అంచనాలూ భారీగానే ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: