ఈ సంక్రాంతికి సూపర్ హిట్ బొమ్మగా నిలిచిన ఎఫ్-2 సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. సంక్రాంతి బరిలో దిగిన మిగతా సినిమాలన్ని చేతులెత్తేయగా ఎఫ్-2 హౌజ్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాను అనీల్ రావిపుడి డైరెక్ట్ చేశారు. 


సినిమా సక్సెస్ అవుతుందని గట్టిగానే ఫిక్స్ అయిన చిత్రయూనిట్ ఎండ్ కార్డ్ లో ధైర్యంగా ఎఫ్-3 సినిమా అంటూ వేశారు. అనుకున్నట్టుగానే ఎఫ్-2 గ్రాండ్ సక్సెస్ అయ్యింది. వెంకటేష్ మళ్లీ ఇదవరకు ఫాంలోకి వచ్చేసినట్టు చెప్పుకుంటున్నారు. వరుణ్ తేజ్ కూడా తెలంగాణా యాసలో అదరగొట్టేశాడు. సినిమా సక్సెస్ మీట్ లో ఎఫ్-3 ఉంటుందని చెప్పారు దర్శకుడు అనీల్ రావిపుడి.  


వరుణ్ తేజ్ కూడా ఎఫ్-3 ఇంకాస్త ఎక్కువ నవ్వించేస్తాం అన్నట్టుగా చెప్పాడు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎఫ్-2 లో ఇద్దరు హీరోలు కాగా ఎఫ్-3 కోసం మరో హీరోని యాడ్ చేస్తున్నారట. మాస్ మహ రాజ్ రవితేజ కూడా ఎఫ్-3 లో ఉంటాడని తెలుస్తుంది. ఇంతకుముందే అనీల్ రావిపుడితో రాజా ది గ్రేట్ సినిమా హిట్ కొట్టిన రవితేజ ఎఫ్-3 లో నటించేందుకు సై అన్నాడట.


వెంకటేష్, వరుణ్ తేజ్, రవితేజ ఈ ముగ్గురు చేసే హంగామా ఎఫ్-3లో ఉంటుందట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అన్నది తెలియాల్సి ఉంది. దిల్ రాజు తలచుకుంటే ఈ కాంబో సెట్ చేయడం పెద్ద విషయమేమి కాదు. ఎలాగు రవితేజకు ఇప్పుడు అర్జెంట్ హిట్ కావాలి కాబట్టి ఇలాంటి కామెడీ జానర్ సినిమా చేస్తేనే బెటర్. మరి ఎఫ్-3 మరిన్ని డీటైల్స్ ఎప్పుడు వెళ్లడిస్తారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: