విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటించిన సినిమా ఎఫ్-2. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా దిల్ రాజు నిర్మించారు. తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి వచ్చి సూపర్ హిట్ కొట్టింది. ఒకప్పటి వెంకటేష్ ను గుర్తుచేస్తూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా వసూళ్ల భీభత్సం సృష్టిస్తుంది.


సినిమా 10 రోజుల కలక్షన్స్ చూస్తే ఎఫ్-2 కలక్షన్స్ హంగామా ఏంటో తెలుస్తుంది. 34 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన ఎఫ్-2 సినిమా 11 రోజుల్లో 60.92 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ సినిమా కలక్షన్స్ ఈ రేంజ్ లో ఉంటే ఇక శాటిలైట్, డిజిటల్ రైట్స్ కూడా అదరగొడుతున్నాయని చెప్పొచ్చు.


నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి, కలిసుందాం రా సినిమాల్లో వెంకటేష్ కామెడీ అందరిని అలరించింది. మళ్లీ అలాంటి వెంకటేష్ ను ఈ సినిమాలో చూశాం. ఎఫ్-2 సక్సెస్ లో మెగా హీరో వరుణ్ తేజ్ పాత్ర కూడా ఉంది. తెలంగాణ యాసలో వరుణ్ తేజ్ నటన కూడా అందరిని మెప్పించింది. ఎఫ్-2 11 రోజుల ఏరియాల వారిగా కలక్షన్స్ వివరాలు చూస్తే..


నైజాం : 16.79 కోట్లు
సీడెడ్ : 6.35 కోట్లు
ఉత్తరాంధ్ర : 7.38 కోట్లు
ఈస్ట్ : 5.65 కోట్లు
వెస్ట్: 3.20 కోట్లు
కృష్ణా : 4.09 కోట్లు
గుంటూరు : 4.17 కోట్లు
నెల్లూరు : 1.54 కోట్లు
ఏపి/తెలంగాణ : 49.17 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 3.80 కోట్లు
ఓవర్సీస్ : 7.95 కోట్లు 
వరల్డ్ వైడ్ : 60.92 కోట్లు  


మరింత సమాచారం తెలుసుకోండి: