సినిమా తారలకు క్రేజ్  బాగా ఉంటుంది. వారు నడిచే దేవుళ్ళుగా అంతా భావిస్తూంటారు. సినిమా వాళ్ళు చెబితే వినే వారు కూడా ఇంకా ఉన్నారు. ఆ అండ చూసుకునే ఇపుడు చాలా మంది తమ కెరీర్ మలుపులో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. తెలుగు సినిమా విషయానికి  వస్తే అన్న నందమూరిని ఏకంగా గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన ఎలా నడిస్తే అలా  జనం వెంట నడిచారు.


ఇపుడు ఈ టాపిక్ ఎందుకంటే  వచే ఎన్నికల్లొ తెలుగు సినిమా హీరోలు ఎటు వైపు ఉంటారు అన్నది చర్చకు వస్తోంది కనుక. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తరువాత ఏపీలో సినిమా రాజకీయాలు కూడా తగ్గిపోయాయి. హైదరాబాద్ లో పరిశ్రమ ఉంది. దాంతో సినిమా నటులంతా టీయారెస్ బాస్ ని ప్రసన్నం చేసుకుంటూ గడిపేస్తున్నారు. ఈ మధ్యన తెలంగాణా ఎన్నికలు జరిగితే టాలీవుడ్ సినీ జనం ఎక్కడా కనిపించలేదు. ఇపుడు ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి. మరి ఇక్కడ ప్రచారానికి తారలు దిగి వస్తారా అన్నది ఇంటెరెస్టింగ్ పాయింట్ గా ఉంది.


నందమూరి కుటుంబం నుంచి బాలక్రిష్ణ ఆల్ రెడీ టీడీపీలో ఉన్నాడు. ఇక కళ్యాణ్ రాం, ఇతర సోదరులు ఆయన వెంట నడిచి టీడీపీ ప్రచారానికి వస్తారని అంటున్నారు. అయితే జూనియర్ తారక రాముడు రూట్ ఎటు అన్నది చూడాలి.  మెగా ఫ్యామిలి విషయానికి వస్తే నా వెంట కుటుంబం ఎవరూ రారు జనసేనాని పవన్ అన్నారు. కానీ ప్రచారం   పీక్స్ లో ఉన్న వేళ ఎవరైనా రావచ్చు అంటున్నారు. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు సపోర్ట్ తన బావ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కి ఉండొచ్చు. 


అదే విధంగా చూసుకుంటే వైసీపీకి ఈసారి ఎక్కువమంది సినీ తారల బలం కనిపిస్తోంది. భానుచందర్, థర్టీ యియర్స్ ప్రుధ్వీ, వినాయకుడు   ఫేం రాజు, పోసాని క్రిష్ణ మురళి వంటి వారు ప్రచారంలో  కనిపించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక వైసీపీ తరఫున అక్కినేని నాగార్జున ఈసారి ప్రచారం కానీ, పోటీ కానీ చేస్తారని కూడా టాక్ నడుస్తోంది. అదేంటో చూడాలి. మొత్తానికి ఈ ఏడాది ఏప్రిల్ చివర్లో ఎన్నికలు అంటున్నారు. అప్పటికి సమ్మర్ తో పాటు సినిమా నటులకు కూడా పొలిటికల్ హీట్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: