ఓ సినిమా హిట్ అయితే క్రెడిట్ నాదంటే నాది అంటారు. పొరపాటున ఫ్లాప్ అయితే మాత్రం డైరెక్టర్ మీద తోసేస్తారు.  నిజంగా ఓ సినిమా విజయంలో డైరెక్టర్ ది కీ రోలే కానీ ఆయనే మొత్తం కాదు. ఆలా ఆయన్ని  అనుకున్నది అనుకున్నట్లుగా  కూడా పని చేయనివ్వరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. బ్లాక్ బస్టర్ హిట్లు వరసగా ఇచ్చిన  డైరెక్టర్ కి ఒక్క ఫ్లాప్ వస్తే చాలు హీరోలు ముఖం కూడా చూడడంలేదు.


ఇపుడు సంక్రాంతికి రిలీజ్ అయి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఓ మూవీకి సంబంధించి టాప్ మాస్ డైరెక్టర్ పరిస్థితి అలాగే ఉందిట. ఆయన‌తో కమిట్ అయిన ఇద్దరు స్టార్ హీరోలు ఆ మూవీ రిజల్ట్ చూసి హ్యాండ్ ఇచ్చేశారు. దాంతో అతని పని అయిపోయిందా అన్నంతగా డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళిపోయాడట. ఇక మరో ఇంటలిజెంట్ డైరెక్టర్ కి కూడా ఈ సంక్రాంతి షాక్ ఇచ్చింది. దాంతో ఆయన క్రియేటివిటీ మీద కూడా డౌట్లు పెడుతూ చాలా మంది దూరం అంటున్నారుట. 


ఇదిలా ఉండగా గతంలో టాప్ హీరోలను డైరెక్ట్ చేసి ఎన్నో హిట్లు తీసిన వారు సైతం ఇపుడు చాన్సులు లేక స్టార్ హీరో ముందు చేతులు కట్టుకుంటున్నారుట. అంతే కాదు. వారికి కధలు చెప్పి ఒప్పించడానికి ఎన్నో స్టోరీస్ రాసి రాసి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారట. మరి వీరే ఆ హీరోలకు ఇంతకు ముందు హిట్లు ఇచ్చారు. అయినా వారి టాలెంట్ ని శంకించి మరీ స్టోరీ బాలేదని తిప్పి పంపే స్టార్లు మనకు ఉన్నారు. 


ఇక మరో డైరెక్టర్ గత‌ ఏడాది ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అయినా సరే కధ బాలేదంటూ ఓ స్టార్ హీరో ఆయన్ని నస పెట్టి చంపుతున్నాడుట. దాంతో ఆ కాంబో లో మూవీ ఉంటుందో లేదో తెలియడంలేదు. అదే విధంగా మరో క్రేజీ డైరెక్టర్ పరిస్థితి కూడా సేం టు సేం. ఆయన సైతం స్టోరీ ఓకే కోసం ఓ సీనియర్ బడా హీరో ముందు పడిగాపులు పడుతున్నారుట. మొత్తానికి వీరంతా బయట స్టార్ డైరెక్టర్లే కానీ వీరిని ఆడించే అసలైన డైరెక్టర్లు మాత్రం స్టార్ హీరోలే అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: