కాజల్ అగర్వాల్ టాలీవుడ్ అందాల రాశి. గత పదేళ్ళుగా వెండి తెరను నిండు చందమామలా ఏలుతోంది. ఈ మధ్యలో ఎంతో మంది వచ్చారు, వెళ్లారు, కానీ కాజల్ మాత్రం తన స్టార్ ఇమేజ్ ని అలాగే కాపాడుకుంటూ వస్తోంది. ఏ ఏటికి ఆ ఏడు వయసు పెరుగుతున్నా గ్లామర్ కూడా అంతకు రెట్టింపు పెంచుకుంటూ వస్తున్న ఈ అమ్మడు పెళ్ళి కాకుండానే పెద్దమ్మ అయిపోయింది. 


ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ కొన్ని తెలుగు మూవీస్ చేసిన తరువాత పెళ్ళి చేసేసుకుని ఎంచక్కా పండటి బాబు కు జన్మనిచ్చింది. మరి కాజల్ విషయానికి వస్తే ఇంకా పెళ్ళి ఘడియలు రాలేదంటూ చెబుతూ వస్తోంది. కొత్త ఏడాదైనా ఆ శుభ వార్త ఉంటుందా అంటే నో అనేస్తోంది. ఈ ముద్దు గుమ్మ. తనకు చేతి నిండా సినిమాలు ఉన్నాయని ఇపుడిపుడే పెళ్ళి వూసు వద్దంటూ తెలివిగా చెబుతోంది. పోనీ పెళ్ళి కొడుకు ఎలాంటి వాడు కావాలని అడిగితే మాత్రం గడుసుగానే జవాబులు చెబుతోంది.


తనకు సినిమా పరిశ్రమతో సంబంధం ఉండకూడదట. సినిమా వాసనలు కూడా అసలు తగలకూడదట. తనను అర్ధం చేసుకున్న వాడు అయితే చాలు, బయట వ్యక్తినే పెళ్ళి చేసుకుంటాను తప్ప సినీ ఇండస్ట్రీకి చెనిన వారిని చేసుకోనంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. మరి కాజల్ మదిలో ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పటికైతే లేరు. వస్తే మాత్రం అపుడు అందరికీ చెప్పి పెళ్ళి బాజాలు మోగిస్తానంటోంది.


మొత్తానికి కాజల్ ఇంకా పెళ్ళి కూతురు పాత్ర పోషించలేనంటోంది. ప్రస్తుతం భారతీయుడు 2 లో కమల్ పక్కన నటిస్తున్న కాజల్ మరిన్ని మంచి పాత్రలు వేస్తానని చెబుతోంది. సో. ఆమె ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్.



మరింత సమాచారం తెలుసుకోండి: