టాలీవుడ్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబోలో ప్రకటించిన ఐస్మార్ట్ శంకర్ ఇవాళ పూజా కార్యక్రమాలతో షూటింగ్ మొదలు పెట్టేసుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు 'ఇస్మార్ట్ శంకర్'  టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.  ఈ సినిమాకి పూరి దర్శకుడిగానే కాదు .. నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. చార్మీ సహ నిర్మాతగా వుంది. ఈ సినిమాలో రామ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. కొంతకాలంగా ఆయన ఈ లుక్ పైనే శ్రద్ధ పెడుతూ వస్తున్నాడు.  ఎప్పుడు లేని కొత్త లుక్ లో రామ్ చాలా వెరైటీగా కనిపిస్తున్నాడు.


కేవలం మూడు నెలల వ్యవధిలో షూటింగ్ పూర్తయ్యేలా ప్లానింగ్ చేసుకున్న పూరి మేలో రిలీజ్ చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ మధ్య కాలంలో హీరో రామ్ వరుస ఫ్లాపులు చవి చూస్తున్నాడు.  అదేవిధంగా టెంపర్ సినిమా తర్వాత పూరి కూడా వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్నాడు.  దాంతో ఆయనతోపాటు అభిమానులు కూడా నిరాశతో వున్నారు.  ఈ సారి తప్పకుండా సక్సెస్ ను పట్టుకోవాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. 

Image result for ismart shankar

ఈ మధ్య రొటీన్ లవర్ బాయ్ పాత్రలతో బోర్ కొట్టేసిన రామ్   'ఇస్మార్ట్ శంకర్' కోసం రెడీ అయ్యాడు. చాలా కాలం తర్వాత పూరి మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించడం మరో విశేషం. పూరి మార్క్ మాస్ కంటెంట్ తోనే ఈ సినిమా రూపొందనుందనే విషయం టైటిల్ ను బట్టే తెలుస్తోంది. సత్య దేవ్, పునీత్ ఇస్సార్, ఆశిష్ విద్యార్ధి,మిలింద్ గునాజి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని పూరి అంతా తానై నిర్మిస్తున్నాడు. మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: