టాలీవుడ్ క్రేజీ డైరక్టర్స్ లిస్ట్ లో పూరి జగన్నాథ్ కూడా ఉండేవాడు.. అది ఒకప్పటి మాట ఇప్పుడు డైరక్టర్ పూరి సినిమా అంటే వామ్మో అనుకునే పరిస్థితి వచ్చింది. టెంపర్ తర్వాత చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవడంతో పూరి ఇక గెటిన్ అవడం కష్టమే అనుకున్నారు. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా పూరి మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టాడు.


ఆ ప్రయత్నంలో భాగమే ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా ఈరోజు ముహుర్త కార్యక్రమాలు జరుపుకుంది. ఇంతకుముందే ఫస్ట్ లుక్ తో కిరాక్ అనిపించేసిన పూరి నేటి నుండి రెగ్యులర్ షూట్ మొదలుపెట్టాడని తెలుస్తుంది. అయితే ఈరోజు మీడియా కవరేజ్ కు వెళ్లగా సినిమా కథ చూఛాయగా పోకిరిని పోలి ఉంటుందని చెవులు కొరుక్కుంటున్నారు.


సూపర్ స్టార్ మహేష్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి సినిమా అప్పట్లో రికార్డులు సృష్టించింది. అయితే ఆ సినిమాలో హీరో చివరిదాకా పోలీస్ అన్న విషయం తెలియదు.. ఆ ట్విస్ట్ తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అయితే అలాంటి క్రేజీ ట్విస్ట్ ఒకటి ఇస్మార్ట్ శంకర్ లో ఉందట.


అందుకే ఇస్మార్ట్ శంకర్ కు పోకిరి సినిమాతో పోలిక పెడుతున్నారు. అందులో హీరో మహేష్ రఫ్ లుక్ తో కనిపిస్తాడు. రాం కూడా ఇస్మార్ట్ శంకర్ కోసం రఫ్ గా మారాడు. అయితే రాం స్టైలిష్ లుక్ మాత్రం ఆకట్టుకుంది. మరి పోకిరి తీస్తాడో.. పోకిరి స్టైల్ ఫాలో అవుతాడో తెలియదు కాని ఈసారి పూరి కాస్త జాగ్రత్త వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి పూరి ఇస్మార్ట్ శంకర్ అయినా హిట్ కొడుతుందా లేదా అన్నది చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: