విలక్షణనటుడు మోహన్ బాబు ఏవిషయం పై అయినా ఎటువంటి మొహమాటం లేకుండా చాల స్పష్టంగా మాటాడుతాడు. ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
 ఆస్తులు తాకట్టు పెట్టుకుంటున్నా
గతకొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజ్ రీఎంబర్స్ మెంట్ వ్యవహారంలో అనుసరిస్తున్న విపరీతమైన ఆలస్యం వల్ల తన శ్రీవిద్యానికేతన్ కు రావలసిన 20 కోట్లు బాకీపడిన విషయాన్ని వివరిస్తూ ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవడంతో తన ఆస్తులు తాకట్టు పెట్టుకుని శ్రీవిద్యానికేతన్ నడపవలసిన పరిస్థితి ఏర్పడింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. అంతేకాదు ప్రతినెల శ్రీవిద్యానికేతన్ లో పనిచేసేవారి జీతాల కోసం తనకు నెలకు 6 కోట్లు ఖర్చు అవుతున్న విషయాన్ని వివరించాడు మోహన్ బాబు.
రాజకీయాల్లోకి
ప్రభుత్వం ఎన్నో పదకాలు చేస్తున్నట్లుగా పబ్లిసిటీ చేసుకుంటున్న విషయాలను వివరిస్తూ కనీసం చదువుకుంటున్న విద్యార్ధుల ఫీజు రీఎంబర్స్ మెంట్ గురించి పట్టించుకోని ప్రభుత్వం తీరు పై తీవ్ర అసహనాన్ని వ్యక్తపరిచాడు ఈవిలక్షణ నటుడు. తిరుపతి దగ్గర ఉన్న  చంద్రగిరిలో మోహన్ బాబు ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు తనను కలిసిన మీడియా వర్గాలతో ఈసంచలన వ్యాఖ్యలు చేసాడు. 
 6 కోట్ల ఖర్చు
గతకొంత కాలంగా మోహన్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ప్రస్తుతం ఈకామెంట్స్ పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీనితో రాబోతున్న ఎన్నికలలో మోహన్ బాబు కానీ లేకుంటే అతడి కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు కానీ చిత్తూరు జిల్లా నుండి ఎన్నికల బరిలో దిగడం ఖాయం అన్న సంకేతాలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: