యూట్యూబ్ సెన్సెషన్ గా మారిపోయిన ప్రియావారియర్ నటిస్తున్న ‘ఒరు ఆధార్ లవ్’ మూవీని తెలుగులో ‘లవర్స్ డే’ గా డబ్ చేసి విడుదల చేస్తున్నారు. వచ్చేనెల విడుదల కాబోతున్న ఈమూవీ ఆడియో ఫంక్షన్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ ఫంక్షన్ కు అతిధిగా వచ్చిన అల్లు అర్జున్ పై ప్రియ వారియర్ వేసిన రొమాంటిక్ పంచ్ ఈ ఫంక్షన్ కు హైలెట్ గా మారింది. 
మలయాళం నన్ను ఆదరిస్తోంది
ఈ ఫంక్షన్ కు అల్లు అర్జున్ రాగానే యాంకర్ సుమ కోరికమేరకు ప్రియా వారియర్ తన గన్ షాట్ సీన్ ను మళ్ళీ లైవ్ లో యాక్ట్ చేసి ఏకంగా తన గన్ ను అల్లు అర్జున్ వైపు గురి పెట్టడంతో ఆ సన్నివేసం నిన్నటి కార్యక్రమానికి హైలెట్ గా మారింది. దీనితో మీడియా కెమెరాలు అన్నీ బన్నీని టార్గెట్ చేస్తున్న ప్రియా వారియర్ పై ఫోకస్ పెట్టాయి. 
అందులో గొప్పేమీ లేదు
ఈకార్యక్రమంలో పాల్గొన్న అల్లు అర్జున్ మాట్లాడుతూ తనకు దక్షిణాది స్టార్ అనిపించుకోవడం తనకు ఇష్టం అని చెపుతూ తనకు మళయాళ రంగంలో ఏర్పడ్డ క్రేజ్ కు కృతజ్ఞతగా తాను ఈమూవీ ఫంక్షన్ కు అతిధిగా వచ్చి ఈమూవీని తాను ప్రమోట్ చేస్తున్న విషయాన్నితెలియచేసాడు. తనకు 14 సంవత్సరాల వయస్సు వచ్చిన దగ్గర నుండి ‘ప్రేమికుల రోజు’ ప్రాముఖ్యత తనకు తెలిసింది అంటూ ఇప్పటికీ ‘ప్రేమికుల రోజు’ ను తన భార్యతో సెలెబ్రేట్ చేసుకుంటూ ఆమెకు సర్ప్రైజ్ గిఫ్ట్ లు ఇవ్వడం తనకు అలవాటుగా మారిన విషయాన్ని బన్నీ లీక్ చేసాడు.
ఫ్యాన్స్‌పైకి తూటా
ఇదే కార్యక్రమంలో మాట్లాడిన ఈమూవీ దర్శకుడు ఒమర్ లులు అల్లు అర్జున్ కు సంబంధించిన ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. మొదట్లో ప్రియా వారియర్ వీడియోను మళయాళ స్టార్స్ ఎవరూ పట్టించుకాలేదని అయితే ప్రియ వారియర్ వీడియో గురించి మొట్టమొదట షేర్ చేసిన సెలెబ్రెటీ బన్నీ అంటూ అతడిని ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసలు కురిపించాడు. ఈమధ్య కాలంలో యూత్ ను టార్గెట్ చేస్తూ క్యూట్ లవ్ స్టోరీ మూవీలు పెద్దగా రాని నేపధ్యంలో ప్రియా వారియర్ ‘ప్రేమికుల రోజు’ సంచలనాలు సృష్టించగలిగితే ఈమెకు టాలీవుడ్ లో కూడ మంచి మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: