ఈ మద్య సూపర్ హిట్ అయిన కొన్ని చిత్రాలు సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే.  తెలుగు లో ఇప్పటికే పలు చిత్రాలు సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని సక్సెస్ అయ్యాయి..కొన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.  ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’చిత్రం రిలీజ్ అయ్యింది.  ఈ చిత్రం రిలీజ్ సమయానికి క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, బోయపాటి శ్రీను, రాంచరణ్ కాంబినేషన్ లో ‘వినయవిధేయ రామ’, రజినీకాంత్ ‘పెటా’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. 
Image result for raviteja f3
ఈ చిత్రాలన్నింటిని బీట్ చేస్తూ..ఎఫ్ 2 భారీ విజయాన్ని నమోదు చేసుకొని వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఈ చిత్రం పాత రికార్డులను తిరగరాస్తూ వెళుతోంది... వెంకటేశ్, వరుణ్ తేజ్ ల కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా ఇది నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని అనిల్ రావిపూడి చెప్పాడు. ఒక వేదికపై వరుణ్ తేజ్ మాట్లాడుతూ 'ఎఫ్ 3' ఉంటుందని అన్నాడు.  కాకపోతే ఈ చిత్రంలో వెంకి, వరుణ్ లతో పాటు మాస్ మహరాజ రవితేజ కూడా ఉండబోతున్నారట. 
Image result for raviteja f3
అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజాది గ్రేట్’చిత్రంతో మంచి విజయాన్నిఅందుకున్న రవితేజ ఈ చిత్రంలో అందుడిగా నటించిన విషయం తెలిసిందే.  అయితే ఎఫ్ 3 చిత్రంలో కూడా రవితేజ అందుడిగానే నటించబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల టాక్. ఈ పాత్ర నుంచి కూడా నాన్ స్టాప్ నవ్వులు పూయించడానికి అనిల్ రావిపూడి రెడీ అవుతున్నాడని చెప్పుకుంటున్నారు. కాకపోతే ఈ విషయంపై అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ రాలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: