ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ ప్రభావం బాలకృష్ణకు మాత్రమే కాకుండా నాగార్జునకు కూడ పాఠాలు నేర్పించింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి నాగార్జున పై ఇలాంటి కామెంట్స్ రావడానికి అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ మూవీ ప్రమోషన్ ఒక కారణంగా మారింది. అఖిల్ తో కలిసి ‘మిస్టర్ మజ్ను’ ను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ్ కు అక్కినేని బయోపిక్ కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. 
Nagarjuna
ఆ ప్రశ్న వచ్చిన వెంటనే షాక్ తిన్నట్లుగా అలెర్ట్ అయిన నాగార్జున తనకు తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ తీసే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని స్పష్టంగా ప్రకటించాడు. అంతేకాదు కొన్ని మీడియా సంస్థలు తమ ఊహలను తనపై ఆపాదిస్తూ అక్కినేని బయోపిక్ గురించి వార్తలు రాస్తున్నాయని ఆవార్తలు అన్ని మీడియా సృష్టి మాత్రమే అంటూ కొట్టి పారేసాడు.
 akkineni nagarjuna exclusive interview
ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా విడుదలకాక ముందు ఆ మూవీకి ఏర్పడిన క్రేజ్ నేపధ్యంలో  ఆ  టైమ్ లోనే ఏఎన్నార్ బయోపిక్ కూడా వస్తే బాగుంటుందనే చర్చ జరిగింది. మరీ ముఖ్యంగా కథానాయకుడు సినిమాలో ఏఎన్నార్ పాత్ర ఉండడంతో పాటు వారిద్దరి మధ్య స్నేహాన్ని చూపించడంతో ఏఎన్నార్ బయోపిక్ లో కూడా ఎన్టీఆర్ కీలకంగా కనిపిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. 
NAGARJUNA MEDIA INTERVIEW LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే ఈ విషయాలపై అప్పట్లో స్పందించని నాగార్జున ఇప్పుడు ఇంత హడావిడిగా ‘మిస్టర్ మజ్ను’ ప్రమోషన్ సమయంలో అక్కినేని బయోపిక్ వార్తలను ఖండించడం వెనుక బాలకృష్ణ ‘కథానాయకుడు’  పరాభవమే కారణం అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అక్కినేని నటించిన సినిమాలను రీమేక్ చేయడానికి భయపడే తాను అక్కినేని బయోపిక్ ను తీస్తాను అనుకోవడం అవివేకం అంటూ నాగార్జున చేసిన కామెంట్స్ బాలకృష్ణ ఫెయిల్యూర్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన కామెంట్స్ మాత్రమే అంటూ ప్రచారం జరుగుతోంది.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: