ప్రస్తుతం తెలుగులో వరుసగా బయోపిక్ సినిమాలు వస్తున్నాయి.  తెలుగు సినీ పరిశ్రమలో కళామతల్లికి రెండు కళ్లుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు అంటారు.  అయితే క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్’బయోపిక్ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ చేశారు.  రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో మిశ్రమ స్పందన వచ్చింది.  ఈ సినిమాలో కేవలం పాటలు కొన్ని సన్నివేశాల కోసమే తీసినట్లు ఉందని విమర్శలు వినిపించాయి.  అంతే కాదు కొంత మంది బయ్యర్లు కూడా భారీగానే నష్టపోయారని టాక్ వినిపిస్తుంది. 

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో బాలకృష్ణ విభిన్నమైన పాత్రల్లో కనిపించారు.  ఎన్టీఆర్ లుక్ పరంగా బాలకృష్ణకు మంచి పేరు వచ్చినా..సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.  ఇక ఏఎన్ఆర్ తనయుడు అక్కినేని నాగార్జున వారసులుగా నాగ చైతన్య, అఖిల్ లు హీరోలుగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అఖిల్ నటించిన  'మిస్టర్ మజ్ను' రేపు భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Image result for akhil mr majnu movie
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున మాట్లాడుతూ.. ఈ మద్య ఏఎన్ఆర్ బయోపిక్ రాబోతుందన్న వార్తలు విన్నాను.  అవన్నీ ఒట్టి రూమర్లు..అసలు ఆయన సినిమా రిమేక్ చేయాలంటేనే భయపడుతున్నాం..అలాంటిది బయోపిక్ ప్రసక్తే లేదు అన్నారు.  అంతే కాదు అక్కినేనికి ఘన నివాళిగా అందించే బయోపిక్ పరాజయం పాలైతే మేము తట్టుకోలేము అన్నారు. మొత్తానికి అక్కినేని బయోపిక్ ను ముందుగా వద్దనుకున్న నాగార్జున, ఆ తరువాత తన కుటుంబ సభ్యులతో చర్చించి .. మనసు మార్చుకున్నారంటూ జరిగిన ప్రచారానికి ఆ విధంగా ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: