ఎన్ టీ ఆర్  కధానాయకుడు మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ తార విద్యాబాలన్ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షక హ్రుదయాలను కొల్లగొట్టారు. ఆమె చేసినది ఒక్క సినిమా అయనా  తెలుగు వారి ఇంటి ఆడపడుచుగా మారిపోయారు. ఆమె నటనకు తెలుగులో మంచి మార్కులే పడ్డాయి. దీంతో టాలీవుడ్లో చాలా మంది కన్ను ఆమెపై పడింది.


లేటెస్ట్ న్యూస్ ఏంటంటే  మెగాస్టార్ కొరటాల మూవీలో విద్యాబాలన్ ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారుట. ఈ విషయంలో ఎక్కువ మొగ్గు ఆమె వైపే కనిపిస్తోందట. విద్యాబాలన్ తో పాటుగా ఈ మూవీలో హీరోయిన్ల ఆప్షన్ గా నయనతార, త్రిష, అనుష్క అనుకున్నా చివరికి ఆమెకే ఓటు వేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ మూవీలో నటబాపరంగా అవకాశం ఉన్న పాత్ర కావడం, సీనియర్ హీరో చిరంజీవికి అన్ని రకాలుగా సెట్ అయ్యే హీరోయిన్ గా విద్యాబాలన్ ఉండడం, ఆమె క్రేజ్ ని ద్రుష్టిలో పెట్టుకుని చాయిస్ ఆమెకే ఇస్తున్నారుట. పైగా విద్యాబాలన్ మెగాస్టార్ కాంబినేషన్ ఫ్రెష్ గా కూడా ఉంటుందని అంటున్నారు.


మరి తెలుగులో నటించడం తనకు ఇష్టమేనని, అయితే మంచి పాత్ర ఉంటే తప్పక నటిస్తానని ఇంతకు ముందే విద్యాబాలన్ చెప్పుకొచ్చారు. దానికి తగినట్లుగా కొరటాల, చిరు మూవీ తయారవుతోంది. పైగా మెగస్టార్ పక్కాన నటించే అవకాశం కావడంతో విద్యాబాలన్ ఒకే అనడం ఖాయంగా  ఉంది. సో విద్యాబాలన్ ని మరో తెలుగు మూవీలో తొందరలోనే చూసే అద్రుష్టం టాలీవుడ్ ప్రేక్షకులకు దక్కబోతోదన్న మాట.



మరింత సమాచారం తెలుసుకోండి: