తెలుగు చలన చిత్ర సీమలో ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే నటుడిగా మోహన్ బాబుకు పేరుకుంది. ఆయన ఎవరినీ లెక్కచేయరు. తప్పుందని భావిస్తే మాత్రం కుండబద్దలు కొట్టేస్తారు. ఆ విషయంలో  లౌక్యం అసలు లేదు. అందుకు మోహన్ బాబు కొంత ఇబ్బంది పడినా  కూడా అయన వైఖరి మాత్రం మారలేదు. తాను అనుకున్న దానికే కట్టుబడి వెళ్ళడమే విలక్షణ నటుడిగా మోహన్ బాబుకు తెలుసు.


సుమారుగా అయిదు వందలకు పైగా చిత్రాలు నటించిన మోహన్ బాబు ఇపుడు సినిమాలు తగ్గించేశారు. మంచి పాత్ర ఉంటే చేస్తానని చెబుతున్న ఆయన సమయం వచ్చినపుడు మాత్రం పొలిటికల్ సెటైర్లు వేస్తూ అందరి చూపు తన వైపు తిప్పుకుంటున్నారు. తెలంగాణా ఎన్నికల్లో టీయారెస్ గెలవాలని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చి తన గట్స్ చాటుకున్న మోహన్ బాబు ఏపీ ఎన్నికల్లో ఎటు వైపు ఉంటారన్నది ఇంటెరెస్టింగ్ న్యూస్ గా ఉంది.
మోహన్ బాబు కు టీడీపీ అధినేత చంద్రబాబుతో చుట్టరికం ఉంది. ఇద్దరికీ చిత్తూరు జిల్లావే. ఇక మరో వైపు వైసీపీ అధినేత జగన్ తోనూ అయన‌కు బంధుత్వం ఉంది. మోహన్ బాబు పెద్ద కోడలు జగన్ చిన్నాన్న కుమార్తె. ఈ విధంగా రెండు పార్టీలతోనూ అనుబంధం ఉన్న ఆయన ఓ మారు టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశారు.


మరి మోహన్ బాబు వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేస్తారా, లేక పోటీ చేస్తారా.., లేక మద్దతు ఇచ్చి వూరుకుంటారా అన్న ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ముందే చెప్పుకున్నట్లుగా మోహన్ బాబు తన భావ జాలాన్ని దాచుకోలేరు కాబట్టి ఆయన ఏపీ ఎన్నికల్లో చురుకుగానే వ్యవహరిస్తారని అంటున్నారు. ఇటీవల మోహన్ బాబు తిరుపతిలోని తన విద్యా సంస్థకు  సంబంధించిన ఓ ప్రోగ్రాం లో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం పై హాట్ కామెంట్స్ చేశారు. 
రెండేళ్ళుగా ఫీజ్ రీ ఇంబర్స్ మెంట్ ట్ ఇవ్వలేదని ఆయన గట్టిగానే విమర్శించారు. మరి దాన్ని బట్టి చూస్తూంటే ఆయన చంద్రబాబు సర్కార్ కి వ్యతిరేకంగానే ఉన్నారనుకోవాలి. ఇంకో వైపు ఆయన వైసీపీ నుంచి పోటీకి దిగుతారని కూడా అంటున్నారు. మరి చూడాలి మోహన్ బాబు రాజకీయం ఏ వైపు సాగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: