హైపర్ ఆది.. ఈటీవీ జబర్దస్త్ ద్వారా ఈ కమెడీయన్ ఓ స్టార్ కమెడియన్ అయ్యాడు. జబర్దస్త్ ప్రోగ్రామ్ మొత్తానికే హైలెట్ అయ్యాడు. ప్రత్యేకించి పంచ్ లపై పంచ్ లు ఇస్తూ యమ నవ్వించడంలో ఆది స్పెషలిస్టు.


అలాంటి ఆది కొన్నాళ్లుగా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాడు. పవన్ కల్యాణ్ జనసేన ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. మళ్లీ గ్యాప్ తర్వాత జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చాడు. వస్తూ వస్తూనే నటి రోజాకు షాక్ ఇచ్చాడు.


రోజాతో వేదికపై డ్యాన్స్ వేయించేందుకు ఆమెను ఉడించాడు ఆది. ఎన్ని కామెంట్లు చేసినా రోజా దగ్గర ఆది పప్పులు ఉడకలేదు. అంతే.. ఆంటీ అంటే కూడా రారా అంటూ కవ్వించాడు ఆది. అప్పటివరకూ సంయమనంతో ఉన్న రోజా ఆంటీ అనేసరికి ఆగలేకపోయింది.


స్టేజీపైకి వచ్చి ఆదిది ఎటాక్ చేసేసింది. ఆంటీ కూతురా అమ్మో అప్సరా పాటకు ఆదితో కలసి స్టెప్పులేసింది. మొత్తానికి ఇన్నాళ్లూ అనసూయతో స్టెప్పులేసిన ఆది.. రోజాతోనూ ఆడిపాడాడు. గ్రాండ్ రీఎంట్రీతో జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో అడుగుపెట్టాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: