హైపర్ ఆది.. జబర్దస్త్ క్రేజ్‌ను పంచ్‌లతో పెంచేసిన హైపర్ ఆది.. స్టేజ్ పైన కామెడీతో పాటు రోమాన్స్ కూడా చేస్తున్నాడు. ఆ మధ్య కొన్ని ఎపిసోడ్లలో యాంకర్ అనసూయపై స్టేజ్‌పై రోమాన్స్ చేశాడు. అనసూయతో డ్యూయెట్లు కూడా పాడేశాడు.



ఐతే.. అదంతా కామెడీలో భాగమే అనుకోండి.. కొన్నాళ్లుగా జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్న హైపర్ ఆది లేటెస్ట్ ఎపిసోడ్‌లో మళ్లీ వచ్చేశాడు. వస్తూ వస్తూనే యాంకర్ అనసూయగా షాక్ ఇచ్చేశాడు.



రొటీన్‌గానే హైపర్ ఆది అనసూయతో డ్యూయట్ ట్రై చేశాడు. ఆ తర్వాత ఇదంతా కామెడీ అని అనసూయ ఉడికించడంతో.. స్టేజ్‌ పైకి ఓ కొత్త అమ్మాయిని తీసుకొచ్చేశాడు. ఆమె ఎవరో కాదు అనసూయ చెల్లెలు వైష్ణవి.. అనసూయకు బదులు అనసూయ చెల్లెలు వైష్ణవితో డ్యూయట్ పాడేశాడు హైపర్ ఆది.



ఒక్కసారిగా తన చెల్లెలు జబర్దస్త్ వేదికపై కనిపించేసరికి అనసూయ షాక్ అయ్యింది. వైష్ణవి తనలా కాదు.. చాలా అమాయకురాలంటూ హైపర్ ఆదిని రిక్వెస్ట్ చేసింది. మరి మీరూ ఒకే చెప్పకుండా.. వైష్ణవిలాంటి వాళ్లను కూడా ఓకే చెప్పనీయకపోతే.. ఇక మాకు లేడీ గెటప్పులు లైనేస్తున్నారు అంటూ హైపర్ ఆది నవ్వులు పూయించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: