కమెడీయన్ అలీకి నోటి దూల కాస్త ఎక్కువనే చెప్పాలి. సినిమాలకు సంబంధించిన ప్రమోషనల్ ఫంక్షన్స్ లో కాస్త విరివిగా మాట్లాడుతూ ఎక్కడో ఓ చోట నోరు జారుతుంటాడు. గతంలో సమంత వీపుపైనా.. అనుష్క తొడలపైనా కామెంట్లు చేసి వివాదాస్పదమయ్యాడు.

suma ali in lover day కోసం చిత్ర ఫలితం


తాజాగా మరోసారి అలీ అదే పని చేశాడు. లవర్స్ డే ప్రీ రిలీజ్‌ వేడుకలో అలీ చేసిన కామెంట్స్ కలకలం సృష్టిస్తున్నాయి. యాంకర్ సుమతో అలీ యాంకరింగ్ చేశాడంటే వేదికపై నవ్వులు పూయాల్సిందే.

suma ali in lover day కోసం చిత్ర ఫలితం


వీరిద్దరి కాంబినేషన్ గతంలో చాలా క్లిక్కయ్యింది. మళ్లీ లవర్స్ డే ప్రీ రిలీజ్‌లోనూ వీరిద్దరూ స్టేజ్ పై సందడి చేశారు. అలీ తన నోటికొచ్చినట్టి మాట్లాడి సుమను ట్రాన్స్ లేషన్ చేయమన్నాడు. అలీ మాట్లాడిన దానిని సుమ అనువదిస్తూ ప్రియావారియర్ ఇక్కడున్న వారి అందరికీ చెల్లి అవుతుందన్నది.

suma ali in lover day కోసం చిత్ర ఫలితం


అలీని ఉడికిస్తూ అలీకి కూడా ప్రియావారియర్ చెల్లే అవుతందన్నది సుమ. దీనికి అలీ సెటైర్‌గా మరి రోషన్ నీకు కొడుకు అవుతాడా అన్నాడు. దానికి సుమ అవును కొడుకే అవుతాడంది. అంతే ఆలీ చెలరేగిపోయాడు. మరి రాజీవ్ కనకాల కేరళ ఎప్పుడు వెళ్లాడు అంటూ డబుల్ మీనింగ్ బాంబ్ పేల్చాడు. పాపం వేదికపైనున్న మళయాళీ కుర్రాడు రోషన్‌కు తెలుగు రాదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత పెద్ద గొడవ అయ్యేదో కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: