రాజమౌళితో సినిమాను తీసే అవకాశం చాల కొద్దిమంది నిర్మాతలకే వస్తుంది. అటువంటి అదృష్టం ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో నిర్మాత దానయ్యకు కలిగినా రాజమౌళి ఈసినిమా విషయంలో అనుసరిస్తున్న తీరుతో దానయ్య అయోమయంలో పడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం రాజమౌళికి ఉన్న క్రేజ్ రీత్యా అతడి   సినిమా మొదలుపెట్టిన రోజునుంచే రైట్స్ సొంతం చేసుకునేందుకు బయ్యర్లు క్యూలో ఉంటున్న పరిస్థితి.  ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో కూడా ఈమూవీకి బయ్యర్ల నుండి విపరీతమైన ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఈ డీల్స్ ఏవి కూడా నిర్మాత దానయ్య ఫైనలైజ్ చేసే అవకాలేకుండా ఉంది అని గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.
రాజమౌళి నిజంగానే ఆ పూజలు చేయిస్తున్నాడా ?
సహజంగా ఏ సినిమాకైనా బిజినెస్ డీల్స్ క్లోజ్ చేసేది ఆ సినిమా నిర్మాతే. కానీ జక్కన్న ప్రాజెక్టులో మాత్రం అలా ఉండదు.  తన సినిమాకు సంబంధించిన బిజినెస్ విషయంలో ప్రతి విషయంలోనూ రాజమౌళి తన ప్రమేయం ఉండేలా చూసుకుంటాడు. ఇలాంటి పరిస్థుతులలో తనకు తెలియకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి ఎటువంటి డీల్స్ ఫైనల్ చేయవద్దని రాజమౌళి దానయ్యకు స్పష్టంగా సూచించాడని టాక్. 
SS Rajamouli
అంతేకాదు ఈసినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక విషయంలో కూడ రాజమౌళి దానయ్యకు చెప్పకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమూవీలో లేటెస్ట్ గా తమిళ దర్శకుడు సముద్రఖని ని ఎంపిక చేసే విషయంలో కూడ దానయ్యకు ఈవిషయాలు చివరి నిముషంలో తెలిసాయి అని అంటున్నారు. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో అడిగినప్పుడు డబ్బు సముకూర్చే చీఫ్ క్యాషియర్ గా దానయ్య పరిస్థితి మారింది అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. అయితే ఇది అంతా దానయ్య ఎదుగుదల చూడలేక కొందరు సృష్టిస్తున్న వ్యతిరేక ప్రచారం అంటూ దానయ్య సన్నిహితులు ఈ వార్తలను ఖండిస్తున్నారు..    


మరింత సమాచారం తెలుసుకోండి: