ఈ మద్య బాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల కన్నా చిన్న హీరోల చిత్రాలు మంచి విజయాన్ని అందుకొని ఐభై కోట్ల వసూళ్లు  చేస్తున్నాయి.  తాజాగా ల‌క్ష్మ‌ణ్ ఉతేక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో కార్తిక్ ఆర్య‌న్‌, కృతి స‌న‌న్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం ‘లుకా చుప్పి’. ఈ చిత్రంలో పెద్ద స్టార్ ఎవరూ లేరు..కాకపోతే హీరోయిన్ కి కాస్త పాపులారిటీ ఉంది.  గతంలో సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన నేనొక్కడినే చిత్రంలో ఈ అమ్మడు నటించింది.   
Luka Chuppi Official Trailer released
మార్చి 1న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్ర ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది.  ఇక చిత్రం విషయానికి వస్తే ఓ మంచి కుటుంబంలో ఓ జంట సహజీవనం చేస్తుంటారు..ఆ సమయంలో జరిగే పరిణామాలు ఎలా ఉంటాయన్న విషయం చాలా ఫన్నీగా తెరకెక్కించారు. లుకా చుప్పి అంటే తెలుగులో దాగుడు మూత‌లు అని అర్ధం.

ఇంట్లో వారికి తెలియ‌కుండా స‌హ‌జీవనం చేస్తున్న జంట భార్య భ‌ర్త‌ల‌లా జీవిస్తుంటారు. ఈ విష‌యం కుటుంబ స‌భ్యుల‌కి తెలిడంతో వారు కూడా వీరితో క‌లిసి ఉండ‌టానికి వ‌స్తారు. ట్రైల‌ర్‌లో కృతి, కార్తీక్‌ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. స‌న్నివేశాలు చాలా ఫ‌న్నీగా ఉన్నాయి. మ్యాడాక్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై దినేశ్ విజన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: