టాలీవుడ్లో మహేష్ బాబు వివాదరితునిగా పేరు తెచ్చుకున్నారు. తన సినిమాలేంటో, తానేంటో అన్నట్లుగా మహేష్ ఉంటారు. తండ్రి క్రిష్ణ దూకుడు స్వభావానికి మహేష్ పూర్తిగా ఆపోజిట్. ఆయనకు సినిమాల్లో కూడా ఇతర హీరోలతో ఎంత వరకూ ఉండాలో అంతవరకే సంబంధాలు మెయింటెయిన్ చేస్తారు. తన ఫ్యామిలి, తన సరదాలు ఇలా మహేష్ ఓ స్పెషల్ హీరో అనిపించుకున్నారు.



ఇంతకీ మహేష్ ఏ పార్టీ అంటే ఎవరూ చెప్పలేరు. మహేష్ ని ఆ మధ్యన మీడియా కూడా రాజకీయాల మీద అడిగితే తనకు అసలు ఏమీ తెలియదంటూ చెప్పి ఊరుకున్నారు. అటువంటి మహేష్ టీడీపీ అని కొందరు అనుకుంటే వైసీపీ అని మరికొందరు భావిస్తున్నారు. అయితే మహేష్ అభిమానులు అన్ని పార్టీల్లో ఉన్నారు. మహేష్ కూడా రాజకీయాలపై ఎపుడు పెదవి విప్పింది . లేదు. ఆయన టీడీపీ అనుకోవడానికి ఒకే ఒక కారణం ఆయన బావ గల్లా జయదేవ్ టీడీపీ గుంటూరు ఎంపీగా ఉండడం. మహేష్ సైతం తన బావ వరకే అన్నట్లుగా గత ఎన్నికల్లో సపొర్ట్ చేసాడు తప్ప ఎంటైర్ టీడీపీకి కానే కాదు. ఆ సంగతి తెలిసి కూడా ఆయన టీడీపీ అనడం నిజంగా ఆయన పేరును వాడేసుకోవడమే.


ఇకపోతే మహేష్ చిన్నాన్న ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైసీపీలో చాన్నాళ్ళు ఉన్నారు. ఆయన అప్పట్లో మహేష్, క్రిష్ణ ఫ్యాన్స్ నంద్యాల ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు ఇస్తారని చెప్పుకొచ్చారు. అయినా మహేష్ నుంచి స్పందన లేదు. ఇపుడు ఆదిశేషగిరిరావు క్రిష్ణ మహేష్ ఫ్యాన్స్ అని చెప్పుకుని టీడీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు. వారందరితో చర్చించి కండువా కప్పుకుంటానని చెబుతున్నారు. నిజానికి మహేష్ ఫ్యాన్స్ ఎపుడు రాజకీయాల్లో ఫ‌లనా పార్టీ అని ప్రకటించలేదు. 


అప్పట్లో క్రిష్ణ కాంగ్రెస్ లో ఉన్నపుడు మాత్రం ఆయన ఫ్యాన్స్ అందులో చురుకుగా ఉండేవారు. మరి ఇపుడు మహేష్ రాజకీయాలకే దూరం అంటూ ఉంటే అయన చిన్నాన్న వాళ్ళను ఈ వైపు లాక్కురావడం ఫక్త్ రాజకీయమే అంటున్నారు. నిజానికి సినిమాల్లో మహేష్ ని అభిమానించే ఫ్యాన్స్ రాజకీయాల్లో తమకు నచ్చిన పార్టీకి ఓటేసుకుంటున్నారు. అలా వారి ఫ్యాన్స్ అన్ని పార్టీల్లో ఉన్నారనుకోవాలి. కేవలం టీడీపీ ప్రాపకం కోసం మహేష్ ని  ఇలా వాడేసుకుంటున్నారని సెటైర్లు పడుతున్నాయి. నేను ఫలాన పార్టీకి సపోర్ట్ అని మహేష్ బాబు నోరు తెరచి చెబితేనే ఓ విలువ ఉంటుంది తప్ప ఇలాంటి ప్రచారాల వల్ల ఏం కాదని కూడా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: