ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీడేస్ సినిమాతో పరిచయం అయిన నిఖిల్ ఆ తర్వాత కార్తికేయ, స్వామిరారా,ఎక్కడికి పోతావు చిన్నవాడ, సూర్య వర్సెస్ సూర్య సినిమాలతో వరుస విజయాలు అందుకున్నాడు.  హీరో నిఖిల్ కొద్ది రోజులుగా ముద్ర అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమా  టీఎన్ సంతోష్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు.  ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మూవీ డైన‌మిక్స్‌, ఎల్ఎల్‌పి ప‌తాకాల‌పై కావ్య వేణుగోపాల్‌, రాజ్ కుమార్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. అయితే తన సినిమాలాంటి పోస్టర్‌ను డిజైన్  చేసారంటూ  నిఖిల్‌ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. 

Image result for నిఖిల్ ముద్ర

అసలు విషయానికి వస్తే..నిఖిల్ నటిస్తున్న ముద్ర సినిమా లోగో మరో సినిమా సినిమా ఉండటం.  ఆ సినిమాలో ప్రధాన పాత్రలో జగపతి బాబు, రావు రమేష్ నటిస్తున్నారు.  బ్లాక్ మని పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిందీ సినిమా. బ్లాక్ మనీపై పోరాటం చేసే వ్యక్తిగా ఈ సినిమాలో జగపతిబాబు కనిపించను న్నారు.  ఎన్.కె. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను క్యూటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నట్టి కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ముద్ర అనే టైటిల్ పెట్టారు. లోగో కూడా నిఖిల్ సినిమాకు చేసినట్లే డిజైన్ చేసారు. 


నిఖిల్ ముద్ర సినిమా అనుకొని అభిమానులు జ‌గ‌పతి బాబు సినిమా టిక్కెట్ల‌ని కొనుక్కుంటున్నారు. నిఖిల్ ఫ్యాన్స్ ఇందులో ఏదో  మోసం ఉందంటూ... నిఖిల్ కు ట్విట్టర్ ద్వారా ఆధారాలతో సహా పంపించారు. దీంతో రంగంలో దిగిన నిఖిల్ నిర్మాతల టీం సదరు యాప్ తో పాటు థియేటర్ల మీద చర్యలకు ఉపక్రమించింది.

Image result for jagapati babu mudra movie

 సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్ ఫిల్మ్ ఛాంబర్ లో జరుగుతుంది. ఆల్రెడీ ఉన్న టైటిల్ తో ఏ మాత్రం పోలిక ఉన్నా కూడా ఫర్మిషన్ ఉండదు..కానీ ముద్ర సినిమాకు అందులోనూ ఒకే డిజైన్ లో ఉన్న టైటిల్ లోగోలకు ఎలా పరిమిషన్ దొరికిందనేది ప్రశ్నగా మారింది.  మా ప్రొడ్యూస‌ర్స్ స‌ద‌రు వ్య‌క్తుల‌పై చ‌ర్య‌ల‌కి దిగుతున్నారు. నా సినిమాకి సంబంధించిన వివరాల‌ని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాను అని నిఖిల్ పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: