విక్టరీ వెంకటేష్ రీసెంట్ గా బంపర్ హిట్ కొట్టాడు. ఎఫ్ 2 పేరుతో చాన్నాళ్ళకు ఇంటిల్లిపాదినీ సినిమా హాళ్ళకు రప్పించి అసలైన సంక్రాంతి పండుగ ఏంటో రుచి చూపించాడు. కొత్త ఏడాదితో బ్లాక్ బస్టర్ హిట్ గా పెరు తెచ్చుకున్న ఎఫ్ 2 ఏకంగా వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. దాంతో సీనియర్ హీరోల్లో మెగాస్టార్ తరువాత  వంద కోట్లు రీచ్ అయిన రెండవ హీరోగా వెంకీ నిలిచారు. మరి ఇంతటి విజయం సొంతమైనపుడు వెంకీ హ్యాపీగా ఉండాలి కదా.


కానీ అయన హెల్త్ సమస్యలపీ విశాఖలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారన్న న్యూస్ ఇపుడు వైరల్ అవుతోంది. నిజానికి వెంకీ ఎంతో హెల్తీ గా ఉంటారు. తన ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు కూడా పాటిస్తారు. అటువంటి హీరోకి ఏమైంది అని అభిమానులంతా ఎంతో బాధ పడుతున్నారు. కలవరపడుతున్నారు. రికార్డ్ బ్రేక్ హిట్ కొట్టిన వెంకి ఫ్యాన్స్ తో కలసి ఆ సక్సెస్ ని ఎంజాయ్ చెస్తారనుకుంటే హాస్పిటల్ పాలు కావడం ఏంటని అంతా హాట్ డిస్కషన్ సాగుతోంది.


అయితే వెంకీకి వచ్చిన సమస్య  పెద్దదేమీ కాదని సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. ఆయన తీవ్రమైన వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారని, దానికి ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో ప్రక్రుతి వైద్యం కోసం ఆయన విశాఖ వచ్చారని, ఇక్కడ నాచురల్ క్యూర్ హాస్పిటల్లో  ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఇది మాములు వైద్యమేనని వెంకీకి ఏమీ కాలేదని కూడా వివరణ ఇస్తున్నారు. కాగా వెంకీ తన కుటుంబ సభ్యులతో విశాఖలోనే చికిత్స  చేసుకుని కొన్ని రోజులు గడిపి తిరిగి హైదరాబాద్ వెళ్తారని అంటున్నారు. సో వెంకీకి ఏం కాలెదు కాబట్టి అభిమానులంతా అంతేగా అంతేగా అనుకుంటూ హ్యాపీగా ఎఫ్ 2 సక్సెస్ ని ఎంజాయ్ చేయొచ్చని కూడా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: