తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి హీరోలు ఎంట్రీ ఇచ్చారు.  మొదటిసారిగా మెగాబ్రదర్ నాగబాబు కూతురు కొణిదెల నిహారిక ‘ఒకమనసు’చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  ఈ చిత్రంలో అద్భుతమైన నటన కనబర్చిన నిహారిక సక్సెస్ మాత్రం అందుకోలేక పోయింది.  ఆ తర్వాత వచ్చిన చిత్రం కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.  తెలుగు లోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది నిహారిక. తాజాగా నిహారిక ప్రధాన పాత్రధారిగా 'సూర్యకాంతం' చిత్రం నిర్మితమవుతోంది.

ప్రణీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో నిహారిక జోడీగా రాహుల్ విజయ్ నటిస్తున్నాడు. పాత తరం చిత్రాల్లో గయ్యాలి అత్తగా, అమ్మగా నటించిన సూర్యకాంతం తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేదు.  ఈ చిత్రం పేరు సూర్యకాంతం పెట్టడంపై అంచనాలు బాగానే పెరిగిపోతున్నాయి.  తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. హీరో నీ పేరేంటి అని అడిగితే..పేరు తెలుసుకొని ఏంచేస్తావు..రేపు నీకు పుట్టబోయే పిల్లలకు పెట్టుకుంటావా.., తినడానికి పునుగులు లేవు కానీ..బెగ్గర్ కి బర్గర్ కొనిచ్చాడట..నీలాండోటు.

సుహాసిని నేను ఐదు నిమిషాల్లో లెక్కపెట్టేలోపు పెళ్లికి ఒప్పుకోకపోతే నిజంగానే చెయ్ కోసుకుంటానని అనడంతో..వెంటనే వన్, టు, త్రీ, ఫోర్, ఫై అంటూ త్వరగా లెక్కబెట్టడం చూస్తుంటే ఈ చిత్రంలో నిహారిక ఎంత అల్లరి పిల్లో అర్థం అవుతుంది. సందీప్ ఎర్రమ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రం మార్చిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ చిత్రం తనకి తప్పకుండా హిట్ ను ఇస్తుందనే నమ్మకంతో నిహారిక వుంది. ఆమె నమ్మకాన్ని ఈ చిత్రం ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: