ఈ మద్య కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా ఇట్టే వైరల్ అవుతుంది.  పాజిటీవ్, నెగిటీవ్ ఏదైనా క్షణాల్లో వైరల్ కావడంతో కొన్ని సార్లు ఇబ్బందుల్లో పడుతున్నారు సెలబ్రెటీలు.  తాజాగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ‘ధడక్’చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.  ఈ అమ్మడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకముందు నుంచి హాట్ లుక్స్ తో ఫోటో షూట్స్ తీయించుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. 
Image result for janhvi kapoor
ఆ మద్య తన తల్లి చనిపోవడంతో కొంత కాలం శోక సంద్రంలో మునిగిపోయిన జాన్వి తర్వాత ‘ధడక్ ’చిత్రం పూర్తి చేసుకొని తన కెరీర్ పై ఫోకస్ చేస్తూ వస్తుంది.  తాజాగా  నెటిజన్ల ట్రోలింగ్ కి బలైంది నటి జాన్వీ కపూర్. గతంలో చాలా సార్లు తన బట్టల విషయంలో ట్రోలింగ్ కి గురైన జాన్వీని మరోసారి నెటిజన్లు టార్గెట్ చేశారు. 
Image result for janhvi kapoor
తాజాగా జాన్వి కాస్మోపాలిటన్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం హోలోగ్రఫిక్ ఎఫెక్ట్ ఉండే వంకాయ రంగు డ్రెస్ వేసుకుంది.  ఈ డ్రెస్ లో జాన్వి చాలా అందంగా కనిపిస్తున్నా..ఆ హోలోగ్రఫిక్ డిజైన్ కాపీ అంటూ కొందరు ఫ్యాషన్ ప్రియులు జాన్వీని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.ఇంటర్నేషనల్ గా పాపులర్ అయిన బాల్మెయిన్ ఫాల్ 2018 కలెక్షన్ లో ఓ మోడల్ వేసుకున్న హోలోగ్రఫిక్ ఎఫెక్ట్ డ్రెస్ ని జాన్వీ కాపీ చేసిందంటూ ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: