మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ అన్నదమ్ములు అన్న సంగతి తెలిసిందే. తమ్ముళ్లంటే ఎంతో ప్రాణంగా చూసుకుంటారు చిరంజీవి. అయితే అలాంటి చిరంజీవి ఓసారి నాగబాబును చితక్కొట్టారట. పాత విషయాలను నెమరువేసుకుంటూ చిరంజీవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు.

chiranjeevi and nagababu కోసం చిత్ర ఫలితం


అసలేం జరిగిందంటే.. చిరంజీవి తండ్రి ఓసారి బట్టలు ఇస్త్రీ చేయించుకురమ్మని చిరంజీవికి చెప్పారట. చిరంజీవి ఆ పని చేసే సమయానికి వేరే అర్జంటు పని వచ్చి.. ఆ పని నాగబాబుకు అప్పగించారట. ఆ తర్వాత పని ముగించుకుని వచ్చిన చిరంజీవి ఇస్త్రీ బట్టల గురించి నాగబాబును అడిగారట.

chiranjeevi and nagababu కోసం చిత్ర ఫలితం


నాగబాబు సింపుల్ గా మరిచిపోయాను అనే సరికి చిరంజీవికి కోపం ముంచుకొచ్చిందట. ఆ కోపంతో తమ్ముడిపై చేయిచేసుకున్నాడట. దాంతో చిరంజీవి తల్లి.. ఎందుకురా చిన్నవాడిని అంతగా కొడతున్నావని చిరంజీవినే తప్పుబట్టిందట.

సంబంధిత చిత్రం


దాంతో హర్ట్ అయిన చిరంజీవి.. తండ్రి వచ్చాక.. ఏడుస్తూ ఆ విషయం మొత్తం వివరించారట. అయితే చిరంజీవి తండ్రి మాత్రం చిరునే సమర్థించి నాగబాబును మందలించారట. చిన్ననాటి ఈ ఘటనను తాను ఇప్పటికీ మరిచిపోలేనని చెబుతారు మెగాస్టార్.


మరింత సమాచారం తెలుసుకోండి: