విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్ కు ‘ఎఫ్ 2’ భారీ సక్సస్ నిరాశను కలిగించడమే కాకుండా ఈమూవీ దర్శక నిర్మాతల పై రాజేంద్రప్రసాద్ ఆగ్రహంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈసినిమా విడుదల అయ్యేంతవరకు రాజేంద్రప్రసాద్ ఈసినిమా ద్వారా తనకు విపరీతమైన పేరు వస్తుందని భావించాడు. 

అంతేకాదు ఈసినిమా విడుదలకు ముందు రాజేంద్రప్రసాద్ ఈసినిమాకు తానే హీరో అంటూ  తన సన్నిహిత మీడియా వర్గాల వద్ద కామెంట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఈసినిమాలో రాజేంద్రప్రసాద్ పాత్రకు సంబంధించి హీరోలతో సమానంగా ప్రాధాన్యత ఉండేలా సన్నివేశాలను దర్శకుడు అనిల్ రావిపూడి క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. 
కలసి వచ్చిన అంశాలు
అయితే ఈసీన్స్ లో చాల భాగం సినిమా నిడివి పెరిగిన రీత్యా ఎడిట్ చేసినట్లు సమాచారం. ఈవిషయం కనీసం రాజేంద్రప్రసాద్ కు చెప్పకపోవడంతో అతడికి కోపం తెప్పించినట్లు టాక్. దీనివల్లనే ‘ఎఫ్ 2’ సక్సస్ మీట్ కు కూడ రాజేంద్రప్రసాద్ రాలేదు అన్నట్లు గాసిప్పులు వినిపిస్తున్నాయి. 
మూడవ వారంలో కూడా
అంతేకాదు ఈసినిమాకు సంబంధించి ఛానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో వెంకటేష్ వరుణ్ తేజ్ తమన్నా మెహరిన్ లతో అనేక కార్యక్రమాలు ప్రసారం చేసినప్పుడు కనీసం ఏ ఒక్క ఇంటర్వ్యూలలోనూ తనను ఇన్వాల్వ్ చేయనందుకు రాజేంద్రప్రసాద్ తీవ్ర అసహనానికి గురి అయినట్లు తెలుస్తోంది. ఒక సీనియర్ హీరోగా ఎంతో ఖ్యాతి గాంచిన తనకు ఇలాంటి పరాభవం ఏమిటి అని రాజేంద్రప్రసాద్ తన సన్నిహితుల వద్ద గగ్గోలు పెడుతున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా ఈమూవీ కలక్షన్స్ ను మరింత పెంచుకోవడానికి ఈసినిమాలో ఎడిట్ కాబడ్డ నాలుగు సీన్స్ ను ఈమూవీతో వచ్చే వారం నుండి జతచేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసీన్స్ రాజేంద్రప్రసాద్ కు సబంధించినవా ? లేదంటే మళ్ళీ వెంకటేష్ వరుణ్ తేజ్ లకు సంబంధించినవా అన్న విషయంలో క్లారిటీ లేదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: