నందమూరి నటరత్న బాలక్రిష్ణ మహానాయకుడు ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతోంది. ఆ సినిమా తరువాత ఆయన కొత్త చిత్రాలను వరసగా లైన్లో పెడుతున్నారు. ఇందుకోసం కొత్త దర్శకులు, కొత్త కాంబోలను కూడా రెడీ చేసిపెట్టుకున్నారు. బాలయ్య తరువాత చిత్రాలు పూర్తి మాస్ టచ్ తో ఉండడమే కాకుండా అభిమానుల దాహాన్ని కూడా తీరుస్తాయని అంటున్నారు. 


ఇదిలా ఉండగా టాలీవుడ్లో ఓ ఇంటెరెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. బాలయ్య కొత్త చిత్రానికి ఎఫ్ 2 ఫేం అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తారని అంటున్నారు. ఈ కాంబో ఫ్రెష్ గా ఉండడమే కాకుండా ఆడియన్స్ మెచ్చే మంచి మూవీని కూడా వీరి నుంచి వస్తుందని అంటున్నారు. కామెడీ మూవీస్ తీయడంతో స్పెషలిస్ట్ గా ఉన్న అనిల్ రావిపూడి బాలయ్య వంటి మాస్ హీరో తో ఏం తీస్తారన్న చర్చ ఉంది. అయితే రేర్ కాంబో కాబట్టే ఆటోమెటిక్ గా అటు అభిమానుల్లో ఇటు ఆడియన్స్ లోనూ ఆసక్తి పెరుగుతోంది. 


ఈ మూవీలో మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా బాలయ్యతో నటిస్తుందని కూడా న్యూస్ ఇపుడు వైరల్ అవుతోంది. తమన్నా ఎఫ్ 2 మూవీలో మెరిసి అందరినీ అలరించింది. మంచి సక్సెస్ వూపులో ఉన్న తమన్నాని రెండవసారి కూడా తన సినిమాలో తీసుకోవాలని అనిల్ రావిపూడి ఫిక్స్ అయ్యాడట. అది కూడా బాలయ్య పక్కన పెయిర్ గా తీసుకోవాలనుకోవడం విశేషం. దీంతో ఇపుడు బాలయ్య మాస్ కి తమన్నా క్లాస్ ట‌చ్ ఎలా మిక్స్ చేస్తాడా అని నందమూరి ఫ్యాన్స్ అపుడే చర్చించుకుంటున్నారు. ఎఫ్ 2 లో వెంకటేష్ పక్కన నటించిన తమన్నా సైరా మూవీలో చిరంజీవి పక్కన జోడీ కడుతోంది. ఇపుడు బాలయ్యతో నటిస్తే సీనియర్ హీరోలతో కూడా అమె పెయిర్ సెట్ అయినట్లవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: